
మీరు హారర్ సినీ ప్రియులా..? మీకు అనుక్షణం సస్పెన్స్, ట్విస్టులతో సాగే సినిమాలు చూడడం ఇష్టమా.. ? అయితే ఇప్పుడు మీ ముందుకు సరికొత్త కంటెంట్ తీసుకువచ్చాం. ఆద్యంతం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అలాగే మీరు ఊహించని ట్విస్టులు.. విజవల్స్ తో సాగుతుంది. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో కాదు యూట్యూబ్ లోనూ అందుబాటులో ఉంది. ఆ సిరీస్ పేరు కరువనం. ఇది యూట్యూబ్‌లో లభించే ఒక వెబ్ సిరీస్. ఇందులో మొత్తం 12 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ 40 నిమిషాల నిడివి ఉంటుంది. చివరి ఎపిసోడ్ 1 గంట నిడివి ఉంటుంది. ఆ ఎపిసోడే ఈ సిరీస్‌కు హైలైట్. ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో సాగుతున్న ఈ వెబ్ సిరీస్ కథ ఏమిటో చూద్దాం.
ఎక్కువ మంది చదివినవి : Anushka Shetty : ఆ హీరో నాకు చాలా స్పెషల్.. అతడే నాకు గాడ్ ఫాదర్.. నా జీవితాన్ని మార్చేశాడు.. అనుష్క కామెంట్స్..
కరువనం కథ విషయానికి వస్తే.. మానవుల రక్తాన్ని తాగే కవల రాక్షస సోదరీమణులు. ఒక సమయంలో వారి శక్తి క్షీణిస్తుంది. తమ శక్తిని తిరిగి పొందాలంటే వారు సిద్ధ వంశంలో జన్మించిన కవల పిల్లలను బలి ఇవ్వాలి. వారిని వెతుకుతూ వారు తిరుగుతూ ఉంటారు. ఆ సమయంలోనే సిద్ధ వంశానికి చెందిన శాలిని, మీరా అనే కవల అక్కచెల్లెల్లు వారి కంటపడతారు. వారిలో ఒకరు గర్భవతి అవుతుంది. ఆ పిల్లలను చంపడానికి ప్రయత్నించిన రాక్షసులు చివరికి తమ లక్ష్యాన్ని సాధించారా? లేదా? ఇదే ఈ వెబ్‌సిరీస్ కథ. ఈ వెబ్‌సిరీస్‌ను సింగపూర్ నేపథ్యంలో రూపొందించారు.
ఎక్కువ మంది చదివినవి : Actor : అందంగా లేని హీరోని పెట్టి తీయడం వల్లే ఆ సినిమా ప్లాప్ అయ్యింది.. నటుడు రవిబాబు..
మూడవ ఎపిసోడ్ నుంచి ఈ సిరీస్ ఆద్యంతం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్‌లోని ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాన్ని భయపెట్టే విధంగా చిత్రీకరించారు. అలాగే ఈ సిరీస్ క్లైమాక్స్ మాత్రం మీరు అస్సలు ఊహించలేదు. ప్రస్తుతం ఈ సిరీస్ యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.
ఎక్కువ మంది చదివినవి : Aadi Movie: ఆది సినిమాలో ఎన్టీఆర్ జోడిగా ఆ హీరోయిన్ చేయాల్సింది.. తనని వెళ్లి అడిగితే ఏం జరిగిందంటే.. డైరెక్టర్ వివి వినాయక్..
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: సైకో భర్తతో కన్నీళ్ల కాపురం.. భార్యతో బలవంతపు శృంగారం.. ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సినిమా..