300 రూపాయలకే బాడీ మొత్తం పెయింటింగ్.. పాత్ర కోసం ప్రాణాలు పోగొట్టుకున్న నటుడు..

సాధారణంగా సినిమా కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టారని వింటుంటాం. అలాగే పలు సందర్భాల్లో తమ పాత్ర కోసం ఎలాంటి రిస్క్ అయిన చేయడానికి రెడీగ ఉంటారు. కానీ ఒక పాత్ర కోసం ప్రాణాలు కోల్పోయిన నటుడి గురించి మీకు తెలుసా.. ? అతడు పోషించిన పాత్ర ప్రభావం చివరకు అతడి ప్రాణాలనే బలి తీసుకుంది. ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలుసుకుందామా.

300 రూపాయలకే బాడీ మొత్తం పెయింటింగ్.. పాత్ర కోసం ప్రాణాలు పోగొట్టుకున్న నటుడు..
Karuppu Subbaiah

Updated on: May 26, 2026 | 3:20 PM

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎంతో మంది నటీనటులు చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారు. కొన్ని సందర్భాల్లో షూటింగ్ సెట్ లో జరిగిన ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు విడిచారు. కానీ మీకు తెలుసా.. ఒక పాత్ర కోసం ప్రాణం కోల్పోయిన నటుడు ఎవరో. అతడు పోషించిన పాత్ర ప్రభావం అతడి ప్రాణాలనే తీసుకుంది. హాస్యనటుడిగా తన జీవితాన్ని ప్రారంభించిన ఆ వ్యక్తి చివరి రోజులు విషాదంతో నిండిపోయాయి. ఈ నటుడు ఎవరో మీకు తెలుసా? అతడి పేరు కరుప్పు సుబ్బయ్య. తెలుగు ప్రేక్షకులకు అతంగా తెలియకపోవచ్చు. కానీ తమిళంలో మాత్రం ఫేమస్ నటుడు. ఆయన 1980, 90వ దశకాలలో విడుదలైన చిత్రాలలో ఎన్నో పాత్రలు పోషించి నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినీరంగంలో ఆయనను వెళ్లై సుబ్బయ్య అని పిలిచేవారు. ‘పెరియ మరుదు’, ‘కట్టబొమ్మన్’ వంటి అనేక తమిళ చిత్రాలలో చిన్న పాత్రలు పోషించారు. ఒక కామెడీ సన్నివేశంలో నటుడు గౌండమణిని ‘ఆఫ్రికా అంకుల్’ అని పిలవడంతో ఆయన అభిమానులలో బాగా ఫేమస్ అయ్యారు.

ఎక్కువ మంది చదివినవి : Rambha : మైఖేల్ జాక్సన్ పక్కన ఉన్నా నాకు ఆ హీరోనే బెస్ట్ డ్యాన్సర్.. హీరోయిన్ రంభ..

అయితే పెరియ మరుదు అనే చిత్రంలో సుబ్బయ్య కీలకపాత్రలో నటించాడు. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో తన శరీరానికి రంగు వేయాల్సి ఉంటుంది. శరీరానికి పూర్తిగా రంగు వేసేందుకు సుబ్బయ్య ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఆ రంగు ప్రభావం తన శరీరంలోకి ఇంకిపోవడంతో ఆయన అనారోగ్యానికి గురయ్యారని .. చాలా కాలంపాటు అనారోగ్య సమస్యలతో బాధపడిన ఆయన చివరకు 2013లో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఆయన చివరి రోజుల్లో ఎలాంటి సినిమా అవకాశాలు గానీ, ఆయనను చూసుకునే వారు గానీ ఎవరూ లేరు. తమిళ చిత్ర పరిశ్రమలో అప్పటికే ‘ఎస్. వి. సుబ్బయ్య’ వంటి ప్రముఖ నటులు ఉండటంతో, ఈయన్ను ప్రత్యేకంగా గుర్తించడానికి ఆయన శారీరక రంగును బట్టి ‘కరుప్పు సుబ్బయ్య’ అని పిలిచేవారు. మధురైకి చెందిన ఈయన, 1960ల ప్రారంభంలో చెన్నైకి వచ్చి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించారు. 1961లో వచ్చిన ‘కుముదం’ లేదా 1962లో వచ్చిన ‘ఇందిరా ఎన్ సెల్వం’ ఈయన మొదటి సినిమాలు గా భావిస్తారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : జయం సినిమాను మిస్ అయ్యింది.. లేదంటే ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యేది.. యాంకరమ్మ బ్యాడ్ లక్..

సినీ పరిశ్రమలో వందలాది సినిమాల్లో నటించినప్పటికీ, ఈయన చివరి రోజులు చాలా పేదరికంలో , ఆర్థిక ఇబ్బందుల్లో గడిచాయి. సరైన అవకాశాలు లేకపోవడంతో తన సొంత ఊరికి తిరిగి వెళ్ళిపోయిన ఆయన 2013లో కన్నుమూశారు. తమిళ సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే పాతతరం నటులలో ఈయన ఒకరు.

ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఆ హీరోయిన్ నాకు చాలా స్పెషల్.. నటనలో ఆమె నాకు పోటీగా ఉండేది.. హీరో శ్రీకాంత్..

కరప్పు సుబ్బయ్య ఫోటో.. 

Karuppu Subbaiah Movies

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ హీరో చాలా అందగాడు.. టాలెంట్ ఉంది.. కానీ స్టార్ హీరో కాలేకపోయాడు.. ఎక్కడ తప్పు చేశాడంటే..

Loading...
Unable to load recommendations.
Follow Us