తండ్రిని చిన్న వయసులోనే కోల్పోయాడు.. డబ్బంతా పోయింది..! కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొని తమ టాలెంట్ తో స్టార్స్ గా రాణిస్తున్నారు. వారిలో ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి ఒకరు. వ్యక్తిగతంగా అలాగే కెరీర్ బిగినింగ్ లో ఎన్నో ఒడిడుకులు చూశాడు ఆయన. ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు

తండ్రిని చిన్న వయసులోనే కోల్పోయాడు.. డబ్బంతా పోయింది..! కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు
Tollywoodnews

Updated on: Sep 30, 2026 | 11:36 AM

టాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత బిజీగా ఉన్న సంగీత దర్శకుల్లో ఆయన ఒకరు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. అంతే కాదు చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. ఆయన సంగీతం ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తుంది.  సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా ఆయన మ్యూజిక్ మాత్రం ఆడియన్స్ కు బాగా ఎక్కేస్తుంది. ఈ పాటికే ఆయన ఎవరో మీకు అర్ధమైపోయిఉంటుంది. ఆయన సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ ఒకరు. స్టార్ హీరోల సినిమాలకు వరుసగా సంగీతం అందిస్తూ తనకంటూ ప్రత్యేకమైన మార్క్ తెచ్చుకున్న ఆయన ప్రయాణం వెనుక మాత్రం ఎన్నో కష్టాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. గతంలో థమన్ కొన్ని ఇంటర్వ్యూస్ లో తన ఫ్యామిలీ గురించి, అలాగే తాను పడ్డ కష్టాల గురించి ప్రస్తావించారు. థమన్ తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారని, ఆ తర్వాత కుటుంబ పరిస్థితులు తన జీవితాన్ని పూర్తిగా మార్చేశాయని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

అలాంటి హీరోయిన్‌ మరొకరు ఉండరు.. అందం, గుణం కలబోసిన నటి.. ఆమె కోసమే ఆ సినిమాను 60, 70సార్లు చూశా

తండ్రి మరణం తర్వాత చదువును కూడా కొనసాగించకుండా సంగీత రంగంలోనే తన ప్రయాణాన్ని ప్రారంభించాల్సి వచ్చిందని అన్నారు. అలాగే సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా సమస్యలు ఆగలేదు. ఒక దశలో ఆర్థిక మోసానికి గురై 2016-17 సమయంలో తన దగ్గర ఉన్న డబ్బును కోల్పోయానని థమన్ చెప్పారు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు కెరీర్‌ను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత. అయినప్పటికీ థమన్ వెనక్కి తగ్గలేదు. వరుస సినిమాలు చేస్తూ తన సంగీతంతో ప్రేక్షకుల్లో గుర్తింపు సంపాదించుకున్నారు.

విరాట్ కోహ్లీ నా బావ.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. షాక్‌లో అభిమానులు

సంగీత దర్శకుడిగా థమన్ ఎదుగుదల ఒక్కరోజులో జరిగినది కాదు. చిన్న వయసులో ఎదురైన వ్యక్తిగత నష్టం నుంచి ఆర్థిక ఇబ్బందుల వరకు ఎన్నో ఇబ్బందులను దాటుకుని ఆయన ఈ స్థాయికి వచ్చారు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందిస్తున్న థమన్ కెరీర్‌ను చూస్తే.. ఒకప్పుడు ఎదుర్కొన్న కష్టాలు, ఇప్పుడు ఉన్న స్థానం మధ్య ఎంత పెద్ద ప్రయాణం ఉందో అర్థమవుతుంది. అందుకే థమన్ గురించి కేవలం ‘హిట్ మ్యూజిక్ ఇచ్చే సంగీత దర్శకుడు’గా కాకుండా.. ఎన్నో ఒడిదుడుకులను దాటి తన స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తిగా కూడా అభిమానులు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం థమన్ తెలుగు, తమిళ్ సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

నువ్వేమైన పెద్ద హీరోయిన్‌వా.., అందగత్తెవా అంటూ అవమానించారు.. కట్ చేస్తే 150కుపైగా సినిమాలు

Thaman S

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us