AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akkineni Nagarjuna: అలా జరిగితే.. మా ప్రతి సినిమాకు వరంగల్‌కు వస్తాం.. నాగార్జున ఆసక్తికర కామెంట్స్

ఈ సినిమాతో అఖిల్ సాలిడ్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా రానుంది. ఈ మూవీలో అఖిల్ రా ఏజెంట్ గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Akkineni Nagarjuna: అలా జరిగితే.. మా ప్రతి సినిమాకు వరంగల్‌కు వస్తాం.. నాగార్జున ఆసక్తికర కామెంట్స్
Nagarjuna
Rajeev Rayala
|

Updated on: Apr 24, 2023 | 7:33 AM

Share

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న నయా సినిమా ఏజెంట్. ఈ సినిమా పై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో అఖిల్ సాలిడ్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా రానుంది. ఈ మూవీలో అఖిల్ రా ఏజెంట్ గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో ఎలాగైన హిట్ కొట్టాలన్న కసి మీదున్నాడు అఖిల్. ఇక ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. అందాల భామ సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను వరంగల్ లో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కింగ్ నాగార్జున గెస్ట్ గా హాజరయ్యారు. నాగ్ తో పాటు ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఏజెంట్ హిట్ అయితే ప్రతి సినిమాకు వరంగల్ వస్తామన్నారు నాగార్జున.

ఆయన మాట్లాడుతూ.. సినిమా హిట్ అవ్వాలంటే ఏ ఏ ఎలిమెంట్స్ ఉండాలో సురేందర్ రెడ్డి ఈ సినిమాకు అవన్నీ సమకూర్చారు అన్నారు.లుగు ప్రేక్షకులు గొప్పవాళ్లు.. మంచి సినిమాలను తప్పకుండా హిట్‌ చేస్తారు. ఈ సినిమా కచ్చితంగా హిట్‌ అవుతుంది. పోరాటాలకు అడ్డా.. వీరత్వానికి ఇంటి పేరు వరంగల్‌. షూటింగ్‌.. ప్రీ రిలీజ్‌.. ఇలా ఏదో ఒక కార్యక్రమం వరంగల్‌లో నిర్వహించిన సినిమాలన్నీ హిట్‌ అయ్యాయి  ఈ సినిమాకూడా హిట్ అవుతుంది అన్నారు నాగార్జున.

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?