స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ ఇటీవలే పెళ్లిపీటలెక్కింది. డిసెంబర్ 12న తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ అంటోని తట్టిల్ తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. గోవాలో హిందూ సంప్రదాయ ప్రకారం ఈ వివాహ వేడుక జరిగింది. ఇక మూడు రోజుల క్రితమే క్రిస్టియన్ పద్ధతిలోనూ ఉంగరాలు మార్చుకుని వెడ్డింగ్ సెల్రేషన్స్ జరుపుకున్నారీ లవ్లీ కపుల్. అయితే పెళ్లి కనీసం వారం కూడా కాలేదు. అప్పుడే తన సినిమా పనులకు పచ్చ జెండా ఊపింది కీర్తి సురేశ్. మెడలో మంగళసూత్రంతోనే తన లేటెస్ట్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసి సినీ అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘మహానటి డెడికేషన్ అంటే అలా ఉంటది మరి’ అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా ఇప్పటికే దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది కీర్తి సురేశ్. ఇప్పుడు బాలీవుడ్ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఆమె నటించిన మొదటి హిందీ సినిమా బేబీ జాన్ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్లు స్పీడ్ అందుకున్నాయి. హీరో కూడా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈక్రమంలోనే కీర్తి సురేశ్ కూడా బేబీ జాన్ ప్రమోషన్స్ లో పాల్గొంది.
కాగా విజయ్ నటించిన తేరీ సినిమాకు హిందీ రీమేక్ గా బేబీజాన్ సినిమా తెరకెక్కింది. ఒరిజినల్ ను తెరకెక్కించిన అట్లీ కుమార్ నే ఈ హిందీ రీమేక్ కు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్ స్వరాలు సమకూర్చాడు.
When our dream icon blessed us at our dream weddinggg! @actorvijay sir 🤗❤️
With love,
Your Nanbi and Nanban#ForTheLoveOfNyke pic.twitter.com/Fpwk2sBVxS— Keerthy Suresh (@KeerthyOfficial) December 18, 2024
#ForTheLoveOfNyke 🤍 pic.twitter.com/DWOoqarM43
— Keerthy Suresh (@KeerthyOfficial) December 15, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.