Kalki 2898 AD OTT: ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. కల్కి2898ఎడి ఓటీటీ‌లోకి వచ్చేది అప్పుడే

|

Aug 13, 2024 | 1:28 PM

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో ప్రభాస్ తన నటనతో ఆకట్టుకోవడం. మహాభారతం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ టచ్ ఇచ్చాడు. ఈ మూవీ పాన్ ఇండియాగా విడుదలై అన్ని భాషల్లో సంచలన విజయం సాధించింది. అలాగే కలెక్షన్స్ పరంగా ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది.

Kalki 2898 AD OTT: ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. కల్కి2898ఎడి ఓటీటీ‌లోకి వచ్చేది అప్పుడే
Kalki 2898 Ad Movie
Follow us on

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి. సలార్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత భారీ అంచనాల మధ్య విడుదలైంది ఈ సినిమా. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో ప్రభాస్ తన నటనతో ఆకట్టుకోవడం. మహాభారతం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ టచ్ ఇచ్చాడు. ఈ మూవీ పాన్ ఇండియాగా విడుదలై అన్ని భాషల్లో సంచలన విజయం సాధించింది. అలాగే కలెక్షన్స్ పరంగా ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. కల్కి సినిమాను థియేటర్స్ లో ఆడియన్స్ రిపీటెడ్‌గా చూశారు. అంతలా ప్రేక్షకులకు కిక్ ఇచ్చింది ఈ సినిమా.. ఇక ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

ఇది కూడా చదవండి : Naga Chaitanya: నాగ చైతన్య, శోభిత కూడా విడిపోతారు.. వేణు స్వామికి నాగ చైతన్య అదిరిపోయే కౌంటర్

తాజాగా కల్కి మూవీ ఓటీటీ గురించి క్రేజీ అప్డేట్ వచ్చింది. త్వరలోనే కల్కి 2898ఎడి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందనితెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ కల్కి సినిమా ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుందని తెలుస్తోంది. అయితే కల్కి సినిమాను రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ చేస్తారని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, అలాగే నెట్ ఫ్లిక్స్‌లో ఈ సినిమాను అందుబాటులో ఉంచనున్నారని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి : ఈ నటుడి భార్య, కూతురు స్టార్ హీరోయిన్స్.. ఇద్దరూ బాలయ్య బాబుతో నటించారు

ఆగస్టు 23 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌ వేదికగా ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. అలాగే కల్కి 2898ఏడీ హిందీ వెర్షన్‌ మాత్రం అదే తేదీ నుంచి మరో ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‌ కానుందని టాక్ వినిపిస్తుంది. ఈ వార్తలు వైరల్‌ అవుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. ఆగస్టు 23 నుంచి కల్కి 2898 ఏడీ అమెజాన్ ప్రైమ్‌‌లో స్ట్రీమింగ్ అవుతుందని న్యూస్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక కల్కి సినిమాలో ప్రభాస్ కర్ణుడిగా కనిపించాడు. అలాగే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలకపాత్రలో నటించారు. త్వరలోనే కల్కి పార్ట్ 2 రానుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే దీని పై అప్డేట్ రానుందని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..