Devara Movie: దేవర షూటింగ్ పై లేటేస్ట్ అప్డేట్.. వైరలవుతున్న ఎన్టీఆర్ వీడియో..

|

Jun 13, 2024 | 1:36 PM

మాస్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో తారక్ ఊరమాస్ లుక్‏లో కనిపించనున్నాడు. అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తారక్ సరసన దివంగత హీరోయిన్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది జాన్వీ.

Devara Movie: దేవర షూటింగ్ పై లేటేస్ట్ అప్డేట్.. వైరలవుతున్న ఎన్టీఆర్ వీడియో..
Devara Movie
Follow us on

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది అత్యధిక అంచనాలు ఉన్న చిత్రాల్లో దేవర ఒకటి. ట్రిపుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తి వెయిట్ చేస్తున్నారు. అలాగే ఆచార్య డిజాస్టర్ తర్వాత ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసితో డైరెక్టర్ కొరటాల శివ ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు. మొదట్లో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‏తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలనుకున్నారు. కానీ ఆ తర్వాత ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకువస్తున్నట్లు ప్రకటించడంతో మూవీ పై మరింత క్యూరియాసిటీ నెలకొంది. మాస్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో తారక్ ఊరమాస్ లుక్‏లో కనిపించనున్నాడు. అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తారక్ సరసన దివంగత హీరోయిన్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది జాన్వీ.

ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై మరింత హైప్ పెంచాయి. ఎప్పుడెప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందా అని ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరలవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతుంది. ఇప్పటివరకు గోవాలో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న తారక్.. ఇప్పుడు హైదరాబాద్ తిరిగి వచ్చారు. తాజాగా ఎయిర్ పోర్టులో తారక్ వస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. గోవా షెడ్యూల్ విజయవంతగా పూర్తి చేసి ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

దేవర సినిమాతోపాటు.. ఈసారి తారక్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు దేవర సినిమాలో నటిస్తూనే మరోవైపు హిందీలో వార్ 2 మూవీలో కీలకపాత్రలో కనిపించనున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో తారక్ రా ఏజెంట్ పాత్ర పోషిస్తున్నాడని తెలుస్తోంది. ఇదివరకే వార్ 2 చిత్రీకరణలో పాల్గొన్నాడు ఎన్టీఆర్.

వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.