Jeevitha Rajsekhar: ప్రతి ఒక్కరి లైఫ్ లో “శేఖర్” ఉంటాడు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన జీవిత

|

May 15, 2022 | 7:24 PM

సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన తాజా చిత్రం శేఖర్. రాజశేఖర్ కెరీర్ లో 91వ సినిమాగా ఈ మూవీ రానుంది. ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్ దర్శకత్వం.

Jeevitha Rajsekhar: ప్రతి ఒక్కరి లైఫ్ లో శేఖర్ ఉంటాడు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన జీవిత
Jeevitha Rajashekar
Follow us on

సీనియర్ హీరో రాజశేఖర్(Rajsekhar) నటించిన తాజా చిత్రం శేఖర్. రాజశేఖర్ కెరీర్ లో 91వ సినిమాగా ఈ మూవీ రానుంది. ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్(Jeevitha Rajsekhar) దర్శకత్వం. స్క్రీన్ ప్లే కూడా అందించారు. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో, పెగాసస్ సినీకార్ప్, టారస్ సినీకార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందు రాబోతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మే 20 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు దర్శకురాలు జీవిత.

జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ..కొన్ని పరిస్థితుల వలన దర్శకురాలు అయ్యాను తప్ప నిజానికి నాకు డైరెక్షన్ చేయాలనే జీల్ ఎప్పుడూ లేదు అన్నారు దర్శకురాలు జీవిత రాజశేఖర్. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ట్రూ స్టోరీ “శేషు” మూవీ తెలుగు రైట్స్ కొన్నప్పుడు ఆ సినిమాను తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా తీయాలిని చాలామంది దర్శకులను కలవడం జరిగింది అక్కడ సూపర్ హిట్ అయిన ఈ సినిమాను రాజశేఖర్ గారికి తగ్గట్టు కొన్ని మార్పులు చేయాలి అన్నారు. అయితే ఆ కథలో ఏ మార్పులు చేయకుండా ఉన్నది ఉన్నట్టు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో నేనే ఆ సినిమాకు దర్శకత్వం చేయాల్సి వచ్చింది. దర్శకురాలిగా అది నా మొదటి చిత్రం. డైరెక్షన్ పరంగా ఏమీ తెలియకున్నా డిఓపి హరి సపోర్ట్ తో అంతా తెలుసుకొని ఆ మూవీ తీయగలిగాను. ఆ తర్వాత నా సొంత సినిమాలకు దర్శకత్వం చేయడం జరిగిందని తెలిపారు.

మలయాళంలో సూపర్ హిట్ అయిన జోసెఫ్ సినిమా మాకు నచ్చడంతో తెలుగు రైట్స్ తీసుకోవడం జరిగింది.ఈ సినిమాను “శేఖర్” పేరుతో తీయాలని పలాస డైరెక్టర్,నీలకంఠ గార్లకు కలవడం జరిగింది. వారు బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా కూడా నేనే దర్శకురాలిగా చేయడం జరిగింది. చాలా రియలిస్టిక్ గా తీసిన “శేఖర్” సినిమా ఎవరు ఏక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటుంది.ఇందులో తన లుక్ కు మంచి అప్లాజ్ వచ్చింది మన లాంగ్వేజ్ కి తగ్గట్టు చిన్న చిన్న మార్పులు చేయడం జరిగింది .ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ప్రతి వ్యక్తి లైఫ్ లో మనకు చాలా ఇష్టపడే వ్యక్తి ఒకరు ఉంటారు. వారు తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్నా ఇలా ఎవరైనా ఆవ్వచ్చు అటువంటివారెవరూ లేకుండా సింగల్ గా మిగిలి పోతే తన మైండ్, ఎమోషన్ ఎలా ఉంటుంది. తన పక్కన ఎవరూ లేకున్నా ఒక కామన్ గా తనకు ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకున్నాడు అనేదే శేఖర్ సినిమా.హార్ట్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ సినిమా టచ్ అవుతుంది. ప్రతి ఒక్కరి లైఫ్ లో “శేఖర్” ఉంటాడు అనేలా ఈ సినిమా కనెక్ట్ అవుతుంది అని చెప్పుకొచ్చారు జీవిత రాజశేఖర్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఇక్కడ చదవండి : 

Udhayanidhi Stalin: తమిళ హీరో షాకింగ్‌ నిర్ణయం.. సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న స్టాలిన్‌!

Karate Kalyani: కరాటే కళ్యాణిపై మరో కేసు నమోదు.. ఆ విషయంలో బాధితుడు ఫిర్యాదు చేయడంతో..

Akshay Kumar: అక్షయ్‌కుమార్‌కి రెండోసారి కరోనా పాజిటివ్‌.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి దూరం..