Jabardasth Nookaraju: నాతో క్లోజ్‌గా ఉండే ఆ నటుడిని నమ్మి 13 లక్షలు ఇస్తే.. షాకింగ్ విషయం చెప్పిన నూకరాజు

పటాస్, జబర్దస్త్ కామెడీ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నూకరాజు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోనూ కంటెస్టెంట్ గా చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అతను తాజాగా జబర్దస్త్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఓ టాక్ షోకు హాజరయ్యాడు.

Jabardasth Nookaraju: నాతో క్లోజ్‌గా ఉండే ఆ నటుడిని నమ్మి 13 లక్షలు ఇస్తే.. షాకింగ్ విషయం చెప్పిన నూకరాజు
Jabardasth Nookaraju

Updated on: Aug 02, 2026 | 2:06 PM

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లలో నూకరాజు ఒకరు. తన కామెడీ పంచులు, ప్రాసలు, యాక్టింగ్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. తన కామెడీ స్కిట్లతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించడమే కాదు ఎమోషనల్ స్కిట్స్ తోనూ అందరినీ ఏడిపిస్తుంటాడు నూకరాజు. పటాస్, జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి ఎన్నో టీవీ షోల్లో తన దైన ముద్ర వేసుకున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. అప్పుడప్పుడు సినిమాల్లోనూ నటిస్తోన్న నూకరాజలు త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోనూ కంటెస్టెంట్ గా చేయనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే బిగ్ బాస్ హౌస్ లో కామెడీకి కొదవలేనట్లే. ఇదిలా ఉంటే తాజాగా ఈ జబర్దస్త్ కమెడియన్ ఓ టాక్ షోకు హాజరయ్యాడు. జబర్దస్త్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచున్నాడు నూకరాజు. ఇదే క్రమంలో తన తోటి ఆర్టిస్ట్ ను నమ్మి మోసపోయానంటూ ఎమోషనల్ అయ్యాడు నూకరాజు.

ఈ సందర్భంగా యాంకర్ వర్ష ‘ నిన్ను వెన్నుపోటు పొడిచిన వాళ్లు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్న వేయగా ఒక్కసారి గట్టిగా నవ్వేశాడు నూకరాజు . ఆ నవ్వులో చాలా అర్థాలు వస్తాయి అని మళ్లీ తిరిగి వర్ష అడగగా.. నూకరాజు షాకింగ్ రిప్లై ఇచ్చాడు. ‘దానిని వెన్నుపోటు అనలేము.. కానీ.. నిత్యం నా వెనుకల తిరిగే ఒక ఆర్టిస్ట్ కి.. వాళ్ల చెల్లికి ఒంట్లో బాగోలేదంటే.. పేపర్ మీద రాయించకుండా.. ఎటువంటి పూచీ కత్తు లేకుండా ఏకంగా రూ.13 లక్షలు ఇచ్చాను. చివరికి అతను డబ్బులు ఇవ్వకుండా’ అంటూ తన మనసులోన ఆవేదనను బయట పెట్టాడు నూకరాజు. దీంతో యాంకర్ వర్ష ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం ఈ విషయం జబర్దస్త్ సర్కిళ్లలో హాట్ టాపిక్ గా మారింది. నూకరాజును మోసం చేసిన ఆ నటుడు ఎవరబ్బా అని నెటిజన్లు ఆరా తీసే పనిలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

కో-ఆర్టిస్ట్ ఆసియాతో జబర్దస్త్ నూకరాజు..

కాగా త్వరలోనే ప్రారంభం కానున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో నూకరాజు పార్టిసిపేట్ చేస్తాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అతను ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన కానీ కామెంట్స్ చేయలేదు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us