
ఇప్పుడంటే క్రేజ్ తగ్గింది కానీ ఒకప్పుడు కొన్ని నెలకే క్రితం వరకు జబర్దస్త్ కు విపరీతమైన బజ్ ఉండేది. గురువారం, శుక్రవారం వస్తే చాలు జనాలు టీవీలకు అతుక్కుపోయేవారు. టాప్ టీఆర్పీతో జబర్దస్త్ కొన్నేళ్లు రాణించింది. ఎంతో మంది కమెడియన్స్ జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొంతమంది ఇప్పుడు సినిమాల్లో సెటిల్ అయ్యారు కూడా.. ఇక జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వారిలో జబర్దస్త్ కొమరక్కగా ఒకరు. కొమరక్కగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు కుమార్. తన కామెడీతో, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా లేడీ గెటప్ లో కనిపించి నవ్వులు పూయించారు కుమార్. కాగా ఓ ఇంటర్వ్యూలో కుమార్ మాట్లాడుతూ.. కొమరక్క అనే తన స్క్రీన్ పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను ఆయన పంచుకున్నాడు. ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి తల్లి పేరు కొమరమ్మ అని, తన పేరు కుమార్కు దగ్గరగా ఉండటం వల్ల కొమరమ్మను కాస్త కొమరక్కగా మార్చుకున్నానని తెలిపాడు
అలాగే పదవ తరగతి పూర్తయిన తర్వాత ఊర్లో భూమి రేట్లు లేకపోవడంతో హైదరాబాద్ వచ్చి హోటళ్లలో పనిచేయడం ప్రారంభించారు. తాజ్ మహల్, కామత్, నందిని, అమృత, సుదర్శన్, ఉడుపి వంటి అనేక హోటళ్ల బ్రాంచ్‌లలో సుమారు ఎనిమిది సంవత్సరాలు పనిచేశా. ఎనిమిది గంటల డ్యూటీ తర్వాత బేగం బజార్‌లో పర్సులు, ఎఫ్ఎం రేడియోలు, నైటీలు, స్కూల్ బ్యాగులు, వర్షాకాలంలో గొడుగులు వంటివి అమ్మేవాడిని. నేను డబ్బు కోసమే వచ్చాను. నా యంగ్ ఏజ్ వృథా చేసుకోవడానికి రాలేదు అని తన గతాన్ని గుర్తుచేసుకున్నాడు కుమార్.
హోటల్ ఉద్యోగం తర్వాత, కుటుంబంలో విభేదాలు రావడంతో, రోజుకు 600 బస్తాలు మోసే అమాలీగా పనిచేయాల్సి వచ్చిందని, అదీ నెలకు కేవలం 4500 రూపాయల జీతానికి అని తెలిపాడు కుమార్. సినిమాలంటే పిచ్చి ఉన్న కొమరక్కను, తన భార్య ప్రోత్సహించిందని.. నాకు మూడు సంవత్సరాలు గడువిస్తా, ఈలోపు నువ్వు సక్సెస్ అవ్వకపోతే తిరిగి వచ్చేయ్ అని చెప్పి, తాను టైలరింగ్ చేస్తూ, బాబు ఫీజులు కడుతూ, ఐదేళ్ల పాటు ప్రతి నెలా 3000 రూపాయలు తన భర్తకు పంపించి, అతన్ని నమ్మి ప్రోత్సహించిందని తెలిపాడు కుమార్. సమాజం నుండి తీవ్ర విమర్శలు ఎదురైనా, ఆమె కొమరక్కకు అండగా నిలిచారు. జబర్దస్త్ షోలో లేడీ గెటప్‌ల గురించి వచ్చే విమర్శలను కొమరక్క ఖండించారు. కమల్‌హాసన్, ఎన్టీఆర్, రాజేంద్రప్రసాద్ వంటి గొప్ప నటులు కూడా లేడీ గెటప్‌లు వేశారని, దానిని ఒక పాత్రగా చూడాలని ఆయన అన్నారు. కొందరు కంటెస్టెంట్లకు హార్మోన్ల సమస్యలు ఉండొచ్చని, వారిని తప్పు పట్టడం సరికాదని, సమాజానికి తాము ఎవరమో చెప్పి ధైర్యంగా బతికే వారిని గొప్పవారుగా చూడాలని చెప్పుకొచ్చాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి