Jabardasth Faima: ఇమ్మూ మంచి స్నేహితుడే.. కానీ బిగ్‌బాస్‌లో సపోర్ట్ చేయకపోవడానికి కారణమిదే: జబర్దస్త్ ఫైమా

జబర్దస్త్ కు సంబంధించి ఇమ్మాన్యుయేల్- ఫైమాలది సూపర్ హిట్ జోడీ. ఈ వేదికపై వీరు కలిసి చేసిన స్కిట్స్ కు బుల్లితెరపై మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఫైమా ఇమ్మాన్యుయేల్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Jabardasth Faima: ఇమ్మూ మంచి స్నేహితుడే.. కానీ బిగ్‌బాస్‌లో సపోర్ట్ చేయకపోవడానికి కారణమిదే: జబర్దస్త్ ఫైమా
Immanuel, Jabardasth Faima

Updated on: Apr 12, 2026 | 2:57 PM

ఈటీవీలో ప్రసారమైన ‘పటాస్‌’ షోతో మంచి గుర్తింపు తెచ్చకుంది ఫైమా. తన కామెడీ పంచులతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత జబర్దస్త్ లోనూ అడుగు పెట్టి బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది.ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లోనూ కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది ఫైమా. విజేతగా నిలవకున్నా తన ఆట, మాట తీరుతో మరింత మంది అభిమానులను సొంతం చేసుకుంది. కాగా జబర్దస్త్ వేదికపై ఫైమా- ఇమ్మాన్యుయేల్ ది మంచి జోడి. వీరి కాంబోలో వచ్చిన స్కిట్స్ బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. కేవలం ఆన్ స్క్రీన్ పైనే కాదు.. ఆఫ్ స్క్రీన్ లోనూ వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్. అయితే గత బిగ్ బాస్ సీజన్ లో ఇమ్మాన్యుయేల్ కు ఫైమా సపోర్ట్ చేయలేదన్న ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయంపై ఫైమా స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యుకు హాజరైన ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అదే సమయంలో ఇమ్మాన్యుయేల్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

‘బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన నా స్నేహితుడు ఇమ్మాన్యుయేల్ కు నేను బహిరంగంగా మద్దతు తెలపకపోవడానికి ప్రధాన కారణం ‘నేటివిటీ’, ‘వ్యక్తిగత ఆట’. సాధారణంగా జబర్దస్త్ వంటి షోలలో కలిసి నటించినప్పుడు ఉండే సాన్నిహిత్యం వేరని, కానీ బిగ్ బాస్ అనేది పూర్తిగా వ్యక్తిత్వానికి సంబంధించిన ఆట. నేను ఇమ్మానియేల్‌కు సపోర్ట్ చేయలేదని చాలా మంది అనుకుంటున్నారు. కానీ, ఒక ఆటగాడిగా అతను ఎలా ఆడుతున్నాడో ఆడియెన్సే నిర్ణయించాలి. నా సపోర్ట్ వల్ల అతనికి ఒరిగేది ఏమీ ఉండదు. పైగా, బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు బయట నుంచి వచ్చే సపోర్ట్ కంటే, లోపల చేసే పెర్ఫామెన్సే చాలా ముఖ్యం. ఇమ్మాన్యుయేల్ తనదైన శైలిలో ఆడితేనే అతనికి గుర్తింపు వస్తుంది.

‘జబర్దస్త్ స్టేజ్‌పై మా జోడీకి మంచి క్రేజ్ ఉంది. కానీ బిగ్ బాస్ వేదికపైకి వచ్చేసరికి పరిస్థితులు మారతాయి. స్నేహితులం కదా అని గుడ్డిగా సపోర్ట్ చేయడం వల్ల అతనికి నష్టం కలిగే అవకాశం ఉంది. అందుకే అతను స్వతంత్రంగా ఎదగాలి. ప్రేక్షకుల మనసులు గెలుచుకోవాలని నేను కోరుకున్నాను. షో నిబంధనలు, వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో మద్దతు తెలపలేకపోయాను’ అని ఫైమా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ జబర్దస్త్ నటి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us