
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు పెళ్లయిందా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె గురించే చర్చ జరుగుతోంది. ఎందుకంటే, కంగనా మెడలో మంగళ సూత్రం, చేతులకు ఆకుపచ్చ గాజులు ఉన్న ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. దీంతో అందరూ కంగనా లుక్ గురించే మాట్లాడుకుంటు్నారు? కంగనా రహస్యంగా పెళ్లి చేసుకుందా? వరుడు ఎవరు? వంటి అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. కంగనా రనౌత్ తన ఇంటి నుంచి కారు వైపు వెళ్తున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో లేత గులాబీ రంగు చీర ధరించి న కంగనా నుదుటిపై బొట్టు పెట్టుకుని కనిపించింది. అలాగే ఆమె చేతిలో ఆకు పచ్చ గాజులు, మెడలో నల్లపూసల దండ కూడా ఉంది. అయితే ఈ లుక్ ను చూసి చాలా మంది కంగనాకు పెళ్లై పోయిందని అనుకుంటున్నారు. అయితే అదంతా అబద్ధం. కంగనా ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘తను వెడ్స్ మను 3’ సినిమా కోసమే ఆమె ఇలా ముస్తాబైందని తెలుస్తోంది. అలాగే క్వీన్ 2 మూవీ కోసం కంగనా ఇలా రెడీ అయిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
కంగనా కెరీర్ లో మర్చిపోలేని చిత్రం క్వీన్. 2013లో రిలీజైన ఈ లేడీ ఓరియంటెడ్ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీకి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో తన అద్భుతమైన నటనకు కంగనా జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. ఇప్పుడు, ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. ‘క్వీన్ ఫరెవర్’ (వర్కింగ్ టైటిల్) పేరుతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ముంబైలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించారు. కంగనా కూడా ఈ షూటింగ్ షెడ్యూల్ కు హాజరవుతోంది.
‘క్వీన్ 2’తో పాటు, కంగనా నటించిన మరో ప్రధాన చిత్రం ‘భారత్ భాగ్య విధాత’ విడుదలకు సిద్ధంగా ఉంది. 2008 ముంబై ఉగ్రవాద దాడుల సమయంలో ఆసుపత్రిలో వందలాది ప్రాణాలను కాపాడిన ఓ నర్సు జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఆ సమయంలో నర్సులు, వార్డ్ బాయ్‌లు, జనరల్ హాస్పిటల్ సిబ్బంది సాటిలేని ధైర్యసాహసాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. మనోజ్ తపడియా దర్శకత్వం వహస్తోన్న ఈ చిత్రంలో కంగనా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 12న థియేటర్లలో విడుదల కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.