Tollywood: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. కొరియోగ్రాఫర్ అరెస్ట్

|

Dec 02, 2024 | 12:20 PM

ఈ మధ్యకాలంలో హైదరాబాద్ లో రేవ్ పార్టీలు, డ్రగ్స్ పార్టీలు ఎక్కువవుతున్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ ఇలాంటివాటికి చెక్ పెడుతుంటే కొంతమంది మాత్రం ఇలా మితిమీరుతున్నారు.

Tollywood: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. కొరియోగ్రాఫర్ అరెస్ట్
Drags
Follow us on

వీకెండ్‌ వచ్చిందంటే చాలు.. హైదరాబాద్‌ వంటి మహా నగరాల్లో డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. హైదరాబాద్‌లో రాత్రి డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ లో రేవ్ పార్టీలు, డ్రగ్స్ పార్టీలు ఎక్కువవుతున్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ ఇలాంటివాటికి చెక్ పెడుతుంటే కొంతమంది మాత్రం ఇలా మితిమీరుతున్నారు. తాజాగా హైదరాబాద్ మాదాపూర్‌లో డ్రగ్స్ పార్టీ జరిగింది. ఓ హోటల్‌లో డ్రగ్స్‌ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు.

కాగా ఈ దాడిలో కొరియోగ్రాఫర్‌ కన్హ మహంతి పట్టుబడ్డారు. మహంతితో పాటు ఆర్కిటెక్ట్‌ ప్రియాంకరెడ్డి కూడా పోలీసులకు పట్టుబడ్డారు. ప్రియాంకరెడ్డి ఇచ్చిన పార్టీలో మహంతి పాల్గొన్నారని తెలుస్తోంది. బెంగళూరు నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చినట్టు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్‌ పార్టీలో పాల్గొన్న నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.4.18 లక్షల విలువైన ఎండీఎంఏ, ఎల్ఎస్, చరాస్ను సీజ్ చేశారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..