Sobhita Dhulipala : ఆమె నటన అద్భుతం.. ఇప్పటివరకు చూడని గొప్ప నటి.. తెలుగమ్మాయి పై హాలీవుడ్ హీరో ప్రశంసలు..

కొద్దిరోజుల క్రితం మేడ్ ఇన్ హెవెన్, ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ చేసిన శోభిత ఇప్పుడు మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ సినిమాలో నటించింది. ఇందులో హాలీవుడ్ హీరో దేవ్ పటేల్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రానికి అతడే దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దేవ్ పటేల్ శోభితపై ప్రశంసలు కురిపించాడు. ఆమె అందగత్తె మాత్రమే కాదని.. గొప్ప నటి అని అన్నారు.

Sobhita Dhulipala : ఆమె నటన అద్భుతం.. ఇప్పటివరకు చూడని గొప్ప నటి.. తెలుగమ్మాయి పై హాలీవుడ్ హీరో ప్రశంసలు..
Dev Patel, Sobhita
Follow us

|

Updated on: Apr 06, 2024 | 6:13 PM

శోభిత ధూళిపాళ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని హీరోయిన్. అచ్చంగా తెలుగమ్మాయి అయినా ముందుగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. రామన్ రాఘవ్ 2.0 మూవీతో నార్త్ అడియన్స్‏ను పలకరించింది. ఆ తర్వాత గూఢచారి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మేజర్ సినిమాలో కనిపించిన ఈ బ్యూటీ గతేడాది డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలు, అటు ఓటీటీ ప్రాజెక్టులలో అలరిస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కొద్దిరోజుల క్రితం మేడ్ ఇన్ హెవెన్, ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ చేసిన శోభిత ఇప్పుడు మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ సినిమాలో నటించింది. ఇందులో హాలీవుడ్ హీరో దేవ్ పటేల్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రానికి అతడే దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దేవ్ పటేల్ శోభితపై ప్రశంసలు కురిపించాడు. ఆమె అందగత్తె మాత్రమే కాదని.. గొప్ప నటి అని అన్నారు.

“ఆమె అందమైన మహిళ మాత్రమే కాదు.. గొప్ప నటి కూడా. మంకీ మ్యాన్ సినిమాలో నేను ఎంచుకున్న పాత్రకు ఆమె వందశాతం న్యాయం చేసింది. నేను ఎలాంటి నటి కావాలనుకున్నానో అందుకు రెట్టింపు ఆమె. ఆమె నటన ఎప్పటికీ గుర్తిండి పోతుంది. మనసులో బాధ ఉన్నా.. తన వారిని కాపాడడం కోసం పోరాడే బలమైన మహిళగా అద్భుతంగా నటించింది. నా జీవితంలో ఇలాంటి సంపూర్ణమైన నటిని చూడలేదు” అంటూ శోభితపై ప్రశంసలు కురిపించాడు. అలాగే మంకీ మ్యాన్ సినిమా గురించి మాట్లాడుతూ.. “నా జీవితంలో నేను కష్టపడిన సినిమా. ప్రతి రోజూ ఏదోక సమస్యను ఎదుర్కొన్నాను. ప్రధాన ఫోటోగ్రఫీకి కొన్ని వారల తర్వాత లాక్ డౌన్ వచ్చింది. కరోనా బరినపడి సినిమాటోగ్రాఫర్ మరణించారు. అప్పుడు ఈ సినిమాను కొనసాగించడం కష్టమని అనుకున్నాను. ఆ తర్వాత ఇండోనేషియా వెళ్లి అక్కడ 500 మంది సిబ్బందితో భారీ సెట్ వేసి చిత్రీకరణ పూర్తి చేశాం. తొమ్మిది నెలలు ఈ సినిమా కోసం కష్టపడ్డాం. కానీ అవుట్ పుట్ చూశాక కష్టాన్ని మర్చిపోయాం” అని అన్నారు.

దేవ్ పటేల్ ‘మంకీ మ్యాన్’తో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు, ఇందులో శోభితా ధూళిపాళ, మకరంద్ దేశ్‌పాండే, సికందర్ ఖేర్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 5న అమెరికాలో విడుదలైంది. భారతదేశంలో విడుదల తేదీ ఇంకా నిర్ణయించలేదు. భారత ఇతిహాసాల్లోని సూపర్ హీరో హనుమంతుడిని స్పూర్తిగా తీసుకున్న హీరో.. బలహీనుల్ని దోచుకునే స్వార్థపరుల ఆట కట్టించేందుకు ఏం చేశాడనే కథాంశంతో ఈ మూవీని రూపొందించారు. ఈ సినిమాను ఏప్రిల్ 26న రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.