సినిమా హీరోలు అంటే పడి చచ్చిపోయే అభిమానులు చాలా మంది ఉంటారు. ఒకొక్కసారి ఆ అభిమానం హద్దులు దాటుతూ ఉంటుంది. కొంతమంది హీరోలు, సినీ సెలబ్రెటీలు అభిమానులతో దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సహనం కోల్పోయి అభిమానులను కొట్టిన వారు కూడా ఉన్నారు. తాజాగా తమిళ్ స్టార్ హీరో సూర్య తండ్రి అభిమానులతో దురుసుగా ప్రవర్తించడం వైరల్ గా మారింది. సూర్య కు తమిళ్ తో పాటు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హీరోగా అభిమానులను ఆకట్టుకుంటూనే.. సేవ కార్యక్రమాలతో తన గొప్ప మనసు చాటుకుంటున్నాడు. అయితే తాజాగా సూర్య తండ్రి అభిమానులతో దురుసుగా ప్రవర్తించారు. ఇప్పుడు ఇదే న్యూస్ కోలీవుడ్ లో మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఓ అభిమాని ప్రేమతో శాలువ కప్పితే సూర్య తండ్రి దాన్ని విసిరి కొట్టారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సూర్య పెద్దగా వివాదాల జోలికి పోడు.. ఎక్కడా కూడా కాంట్రవర్సల్ కామెంట్స్ కూడా చేయలేదు. సూర్య తమ్ముడు కార్తీ కూడా అంతే.. అయితే సూర్య తండ్రి చేసిన పైకి ఇప్పుడు ఆయనను నెటిజన్స్ విమర్శిస్తున్నారు. అభిమానులతో దురుసుగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు అని అంటున్నారు. సూర్య తండ్రి శివకుమార్ తాజాగా చెన్నై లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు.
ఈ ఈవెంట్ పూర్తయి వెళ్లిపోయేటప్పుడు ఓ అభిమాని ప్రేమతో శాలువా తెచ్చి శివకుమార్ కు కప్పబోయాడు. వెంటనే శివకుమార్ ఆ శాలువని పట్టుకొని కిందకు విసిరేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దాంతో కొందరు ఆయనను విమర్శిస్తున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే. ఆ శాలువా తెచ్చింది శివకుమార్ ఫ్రెండ్. చనువు కొద్ది నాకెందుకురా అంటూ శాలువాను విసిరేశారట శివకుమార్. దీని పై శివకుమార్ ఫ్రెండ్ మనవడు కూడా స్పందించారు. మా తాత కరీమ్ శివకుమార్ మంచి స్నేహితులు.. శాలువా ఇస్తున్నప్పుడు.. ఎందుకురా ఇవన్నీ అని జోక్ చేస్తూ దాన్ని విసిరేశారు. ఆతర్వాత ఇద్దరూ కలిసి కిందికి వెళ్ళారు. నిజాలు తెలియకుండా తప్పుగా ప్రచారం చేయకండి అని తెలిపాడు. అలాగే శివకుమార్ కూడా దీని పై స్పందించాడు. నేను కరీమ్ చాలా క్లోజ్. కానీ కొత్తగా నా కోసం శాలువా తీసుకొచ్చాడు. కానీ ఇదంతా నచ్చక తిరిగిచ్చేశాను. అయితే శాలువా కింద పడేయడం నా తప్పే దానికి నేను క్షమాపణలు కూడా తెలుపుతున్నాను అని శివకుమార్ అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.