Allu Arjun: నయా లుక్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న ఐకాన్ స్టార్.. చూస్తే మతిపోవాల్సిందే

|

Mar 26, 2023 | 5:35 PM

తన స్టైల్ తో ప్రేక్షకులను ఫిదా చేశాడు బన్నీ. ఫిల్మ్‌ కెరీర్ బిగినింగ్ నుంచి ట్రెండీ క్లోత్స్‌తో.. స్టైలిష్ అవతార్‌లో కనిపిస్తూ యూత్‌ ను తన వెనక పడేలా చేస్తుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

Allu Arjun: నయా లుక్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న ఐకాన్ స్టార్.. చూస్తే మతిపోవాల్సిందే
Pushpa 2
Follow us on

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు బన్నీ. పుష్ప సినిమా కంటే ముందు బన్నీకి స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్ సంపాదించారు. తన స్టైల్ తో ప్రేక్షకులను ఫిదా చేశాడు బన్నీ. ఫిల్మ్‌ కెరీర్ బిగినింగ్ నుంచి ట్రెండీ క్లోత్స్‌తో.. స్టైలిష్ అవతార్‌లో కనిపిస్తూ యూత్‌ ను తన వెనక పడేలా చేస్తుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. తాజాగా ట్విట్టర్లో ఫైర్ పుట్టిస్తున్నారు. తన లేటెస్ట్ అండ్ హాటెస్ట్ లుక్స్తో.. అందర్నీ నోరెళ్ల బెట్టేలా చేస్తున్నారు.

రింగుల జట్టుతో.. అక్కడక్కడ రాగి వెంటుకలతో.. యాంటీ ఫిట్ షర్ట్‌లో.. పోష్‌ గా ఎయిర్ పోర్ట్‌లో నడుస్తూ రీసెంట్గా.. మీడియా చిక్కిన బన్నీ.. తన లుక్స్‌తో.. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు. సెకండ్‌ పార్ట్‌లో పుష్ప రాజ్‌.. చాలా స్టైలిష్గా ఉంటారంటూ అప్పుడెప్పుడో డైరెక్టర్‌ సుకుమార్ చెప్పిన మాటలకు ఇప్పుడీ నయా లుక్స్‌ తో పర్ఫెక్ట్ గా సింక్ అవుతున్నారు. అంతేకాదు.. తన నయా హెయిర్ స్టైల్‌ను అప్పుడే అందరూ ఫాలో అయ్యేలా కూడా చేసుకుంటున్నారు మన ఐకాన్ స్టార్ .

ఇక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మొదటి పార్ట్ విడుదలై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అలాగే పుష్ప 2 షూటింగ్ త్వరలోనే మొదలవనుంది. ఈ సినిమాలో బన్నీ ఊర మాస్ మసాలా గెటప్ లో కనిపించి అలరించాడు. ఇక పుష్ప 2లో సుకుమార్ ఎక్కువ యాక్షన్ సీక్వెన్స్, ట్విస్ట్ లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు సుకుమార్.