Mahesh Babu: మరోసారి ఆ దర్శకుడికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్స్ తో రెడీ అవుతున్నారు. వీటిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. దాదాపు 11 సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్ లో ఈ సినిమా రాబోతుంది

Mahesh Babu: మరోసారి ఆ దర్శకుడికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?
Mahesh Babu

Updated on: Aug 04, 2022 | 9:13 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్స్ తో రెడీ అవుతున్నారు. వీటిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. దాదాపు 11 సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్ లో ఈ సినిమా రాబోతుంది. దాంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో సూపర్ హిట్ అను అందుకున్నారు మహేష్. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. ఇక త్రివిక్రమ్ సినిమా తోపాటు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు మహేష్. ఈ సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో దర్శకుడికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని చూస్తున్నారట. ఇంతకు ఆదర్శకుడు ఎవరంటే..

మహేష్ నటించిన సినిమాల్లో సూపర్ స్టైలిష్ మూవీ అంటే వెంటనే చెప్పే పేరు అతిథి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అతిథి సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సినిమాలో మహేష్ లుక్.. యాక్షన్ కు ఫ్యాన్స్ అంతా ఫిదా అయ్యారు. ఇప్పుడు మరోసారి మహేష్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారంటూ టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ఓ పవర్ ఫుల్ కథను మహేష్ కు వినిపించారట సురేందర్ రెడ్డి. మహేష్ కు కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. అయితే రాజమౌళి సినిమా పూర్తయ్యే సరికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఈ లోగా సురేందర్ రెడ్డి సినిమాను కంప్లీట్ చేయాలని కూడా అనుకుంటున్నారట. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Loading...
Unable to load recommendations.
Follow Us