Pushpa 3: పుష్ప3 పై క్రేజీ న్యూస్.. మరింత రగడ్ లుక్‌లో అల్లు అర్జున్

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. విడుదలైన అన్ని భాషల్లో విజయం సాధించింది పుష్ప. పుష్ప సినిమాను ముందుగా రెండు భాగాలుగా తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు పుష్ప 3 కూడా రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు బన్నీ.

Pushpa 3: పుష్ప3 పై క్రేజీ న్యూస్.. మరింత రగడ్ లుక్‌లో అల్లు అర్జున్
Allu Arjun
Follow us

|

Updated on: Mar 28, 2024 | 2:47 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. విడుదలైన అన్ని భాషల్లో విజయం సాధించింది పుష్ప. పుష్ప సినిమాను ముందుగా రెండు భాగాలుగా తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు పుష్ప 3 కూడా రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు బన్నీ. ఈ సినిమా పూర్తయిన తర్వాతే ‘పుష్ప 3’తో బిజీ కానున్నాడు.

‘పుష్ప’ సినిమా సెట్స్ పైకి వెళ్లినప్పుడు ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని ప్రకటించలేదు. తాను అనుకున్న కథను మరింత వివరంగా చెప్పాలంటే రెండు భాగాలుగా తెరకెక్కించాల్సిందే అని సుకుమార్ భావించారు.  దాంతో ఇప్పుడు పుష్ప 2 ను మొదలు పెట్టారు. కాగా ఇప్పుడు పుష్ప మూడో భాగం గురించి చర్చ మొదలైంది. అల్లు అర్జున్‌ కూడా ఇటీవలే పుష్ప 3 ఉంటుందని హింట్ ఇచ్చాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సుకుమార్ టైటిల్ కూడా ఖరారు చేశారట.

‘పుష్ప’ మొదటి భాగానికి ‘పుష్ప: ది రైజ్’ అని పేరు పెట్టారు. ఒక సామాన్యుడు పుష్పరాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియా కింగ్‌పిన్‌గా మారడం మొదటి పార్ట్ లో చూపించారు. రెండో భాగానికి ‘పుష్ప: ది రూల్’ అనే టైటిల్ పెట్టారు. పేరుకు తగ్గట్టుగానే ఇప్పుడు మాఫియా కింగ్‌గా మారిన పుష్పరాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ ను ఎలా రూల్ చేశాడు అన్నది చూపించనున్నారు. ఇక ఇప్పుడు ‘పుష్ప: ది రోర్’ పేరుతో మూడో భాగం రెడీ అవుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మరింత రగ్‌డ్‌గా కనిపిస్తాడని అంటున్నారు.

దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రం 2018లో విడుదలైంది. దీని తర్వాత ఆయన తన పూర్తి దృష్టి ‘పుష్ప’ పైనే పెట్టారు. ఇప్పటికే ‘పుష్ప’, ‘పుష్ప 2’ సినిమాల కోసం ఆరేళ్లు కేటాయించాడు. అయితే ఇప్పుడు కొంత గ్యాప్ తీసుకొని పుష్ప 3ని మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ ‘రంగస్థలం’ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో మరో సినిమా రానుంది. ఈ మేరకు ఇటీవలే ఓ ప్రీ లుక్ పోస్టర్ యూ రిలీజ్ చేశారు. రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత దర్శకుడు బుచ్చిబాబు, సుకుమార్ కలిసి సినిమా పనులను నిర్వహించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చేదు రోజులు గుర్తుచేసుకున్న బిగ్‏బాస్ కీర్తి..
చేదు రోజులు గుర్తుచేసుకున్న బిగ్‏బాస్ కీర్తి..
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
రాజస్థాన్ దండయాత్రను లక్నో అడ్డుకునేనా.. రికార్డులు ఎలా ఉన్నాయంటే
రాజస్థాన్ దండయాత్రను లక్నో అడ్డుకునేనా.. రికార్డులు ఎలా ఉన్నాయంటే
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
నాగమణి చెంత ఉంటే అతీత శక్తులు వస్తాయా..? నిజం ఇదే...
నాగమణి చెంత ఉంటే అతీత శక్తులు వస్తాయా..? నిజం ఇదే...
వయసు ఒక నెంబర్ మాత్రమే.. 60 ఏళ్ల వయసులో అందాల సుందరి కిరీటం
వయసు ఒక నెంబర్ మాత్రమే.. 60 ఏళ్ల వయసులో అందాల సుందరి కిరీటం
గోధుమ రవ్వతో ఇలా ఇడ్లీలు చేయండి.. హెల్త్‌తో పాటు రుచి కూడా..
గోధుమ రవ్వతో ఇలా ఇడ్లీలు చేయండి.. హెల్త్‌తో పాటు రుచి కూడా..
రాగి పిండితో పునుగులు ఇలా చేస్తే.. రుచితో పాటు ఆరోగ్యం కూడా!
రాగి పిండితో పునుగులు ఇలా చేస్తే.. రుచితో పాటు ఆరోగ్యం కూడా!
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..
మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..