సినిమా ఇండస్ట్రీలో నిలబలంటే అందంతో అభినయంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఒక హిట్ పడగానే ఆచితూచి అడుగులేయడం చాలా ముఖ్యం. కొంతమంది హీరోయిన్స్ ఒక సినిమా పూర్తయిన వెంటనే పొలోమని వచ్చిన సినిమానల్లా ఓకే చేసుకుంటూ పోతుంటారు. కొంతమంది మాత్రం ఆచితూచి కథలను ఎంచుకుంటూ విజయాలు అందుకుంటూ ఉంటారు.. ఆ లిస్ట్ లో ఈ హీరోయిన్ కూడా ఒకరు. పైన కనిపిస్తోన్న ముగ్గురు పిల్లల్లో ఒకరు ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసుకు గెలుచుకుంది ఈ భామ. గుర్తుపట్టడం పెద్ద కష్టమేమీ కాదు అనుకుంటూ.. తనదైన రూపలావణ్యంతో కట్టిపడేసి ఈ భామ హీరోలను మించిన హాట్ కూడా.. ఇప్పుడు ఇంకా ఈజీగా గుర్తుపట్టొచ్చు.. ఇంతకు ఆ ముద్దుగుమ్మ ఎవరంటే..
తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అదనుకోవడమే కాకుండా ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది అందాల భామ ఫరియా అద్బుల్లా. జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది. నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత పలు సినిమాలో చిన్న చిన్న పాత్రలో కనిపించింది.
అలాగే నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది ఈ భామ. ఇక ఇప్పుడు లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.