Tollywood:హీరోలకు మించి రెమ్యునరేషన్.. 400కు పైగా సినిమాల్లో నటించిన ఈ టాలీవుడ్ విలన్‌ను గుర్తు పట్టారా?

సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా హీరోలదే ఆధిపత్యం. వారికే రెమ్యునరేషన్లు అధికంగా ఉంటాయి. వేరొకరికి ఇచ్చినా ఒప్పుకోరు. అలాంటిది తన అద్భుత నటనతో స్టార్ హీరోలకు మించి పారితోషికాలు తీసుకున్నారీ టాలీవుడ్ విలన్. 400 కు పైగా సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు అందుకున్న ఆయన..

Tollywood:హీరోలకు మించి రెమ్యునరేషన్.. 400కు పైగా సినిమాల్లో నటించిన ఈ టాలీవుడ్ విలన్‌ను గుర్తు పట్టారా?
Tollywood Actor

Updated on: May 04, 2026 | 12:14 PM

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆయన ఒక లెజెండరీ నటుడు. తెలుగుతో పాటు హిందీ సినిమాల్లో తన భయంకరమైన విలనిజంతో అందరనీ భయ పెట్టాడు. భారీ ఆకారం, గంభీరమైన గొంతుతో ఆయన చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులకు ఒణుకు పుట్టించాయలంటే అతి శయోక్తి కాదు. అన్ని భాషల్లో కలిపి సుమారు 400 కు పైగా సినిమాల్లో నటించారాయన. తెలుగులో అయితే టాప్ స్టార్స్ అయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున చిత్రాల్లో ఆయన విలన్ గా చేశారు. ఇక ఆయన అందుకున్న పురస్కారాలైతే లెక్కనే లేదు. బహుశా దేశంలో మరే నటుడు ఇన్ని అవార్డులు అందుకోని ఉండరేమో. ఈ నటుడికి సినిమా అంటే ఎంత ప్రేమంటే చనిపోయే వరకు సినిమాలు చేస్తూనే ఉన్నారు. 72 ఏళ్ల వయసులో ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లినా తన సినిమాలు ,పాత్రల రూపంలో ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాంటి నటుడికి సంబంధించిన ఒక త్రో బ్యాక్ ఫొటో నెట్టింట వైరలవుతోంది. ఇందులో ఆయనతో పాటు భార్య పిల్లలు కూడా ఉన్నారు. మరి ఆ నటుడిని గుర్తు పట్టారా? ఆయన మరెవరో కాదు అమ్రిష్ పురి.

పై ఫొటోలో అమ్రిష్ పురితో ఉన్నది ఆయన భార్య ఊర్మిళ దేవేకర్, కుమారుడు రాజీవ్ పురి, కూతురు నమ్రత. తెలుగు, హిందీ భాషల్లో వందలాది సినిమాల్లో నటించిన అమ్రిష్ పురి 2005 జనవరి 12న కన్నుమూశారు. తెలుగులో మేజర్ చంద్రకాంత్, ఆదిత్య 369, జగదేక వీరుడు అతిలోకసుందరి, కొండవీటి దొంగ, అశ్వమేధం, ఆఖరి పోరాటం, దళపతి వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు అమ్రిష్ పురి. ఇక అమ్రిష్ పురి సినీ వారసత్వాన్ని ఆయన మనవడు వర్ధన్ పూరి కొనసాగిస్తున్నాడు. 2019లో వచ్చిన యే సాలి ఆషికి అనే సినిమాతో వర్ధన్ పూరి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. బ్లాడీ ఇష్క్యూ, దష్మీ, ఆస్క్ వంటి సినిమాల్లో నటించాడు. ఇక ఇప్పుడు వర్ధన్ పూరి తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అప్డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

మనవళ్లతో బాలీవుడ్ దివంగత నటుడు అమ్రిష్ పురి.,

అమ్రిష్ పురి సినీ వారతస్వాన్ని కొనసాగిస్తోన్న మనవడు వర్దన్ పురి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us