Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. 64 ఏళ్ల హీరోతో రొమాన్స్ చేస్తూ..

ఈ స్టార్ హీరోయిన్ ఇప్పటివరకు ఎక్కువగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేసింది. నటిగా ఓ మోస్తరు విజయాలు అందుకుంది. అందం, అభినయం పరంగానూ మంచి మార్కులు తెచ్చుకుంది. ఇప్పటివరకు ఎక్కువగా తమిళ్ సినిమాల్లోనే కనిపించిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే ఒక తెలుగు స్ట్రెయిట్ మూవీతో మన ముందుకు వస్తోంది.

Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. 64 ఏళ్ల హీరోతో రొమాన్స్ చేస్తూ..
Tollywood Actress

Updated on: Aug 12, 2025 | 7:43 PM

పై ఫొటోలో క్యూట్ గా కనిపిస్తున్న పాపను గుర్తు పట్టారా? ఇప్పుడామె సినిమా ఇండస్ట్రీలో ది మోస్ట్ గ్లామరస్ హీరోయిన్లలో ఒకరు. తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలోనూ వరుసగా సినిమాలు చేస్తోందీ అందాల తార. నటన కంటే తన గ్లామర్ తోనే ఎక్కువగా ట్రెండ్ అవుతోందీ ముద్దుగుమ్మ. అందుకే తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఈ బ్యూటీ సినిమా ఇండస్ట్రీకి వచ్చి సుమారు పదేళ్లవుతోంది. పట్టుమని పది సినిమాలు కూడా చేయలేదు. కానీ ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలు క్రేజీ ప్రాజెక్టులోనే నటించింది. ఇప్పటివరకు ఎక్కువగా కన్నడ, మలయాళ, తమిళ సినిమాల్లోనే ఎక్కువగా సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే నేరుగా ఒక తెలుగు సినిమాతో మన ముందుకు రానుంది. అది కూడా పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో కలిసి. ఇప్పటికే చాలా మందికి అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? అని. యస్. ఆమె మరెవరో కాదు మలయాళ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్. ఇటీవలే తన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుందీ అందాల తార. ఈ నేపథ్యంలోనే మాళవిక చిన్నప్పటి ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలయ్యాయి.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్ కుమార్తెనే మాళవిక. గతంలో బాలీవుడ్ లో ‘డాన్’, ‘తలాష్’, ‘ఫుక్రీ’ ‘రయీస్’ తదితర హిట్ సినిమాలకు కేయూ మోహనన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఇక మాళవిక విషయానికి వ స్తే.. కేరళలో పుట్టినా ఎక్కువగా ముంబైలోనే పెరిగింది. నిర్ణయకం అనే కన్నడ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నాను మట్టు వరలక్ష్మి , బియాండ్ ది క్లౌడ్స్ , పేట తదితర హిట్ సినిమాల్లో నటించింది. రజనీకాంత్, విజయ్, ధనుష్, విక్రమ్ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

ఇవి కూడా చదవండి

ది రాజా సాబ్ సినిమాలో మాళవిక..

ప్రస్తుతం ప్రభాస్ – మారుతి కాంబోలో వస్తున్న ది రాజా సాబ్ మూవీతో తెలుగు ఆడియెన్స్ ను పలకరిస్తోంది మాళవిక. ఇదే ఆమెకు మొదటి తెలుగు స్ట్రెయిట్ సినిమా. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది చివరిలో రిలీజ్ కానుంది. ది రాజా సాబ్ తో పాటు మరికొన్ని సినిమాలు ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్నాయి.

ది రాజా సాబ్ గ్లింప్స్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .