
పై ఫొటోలో చిన్నప్పుడే కెమెరా పట్టుకుని పోజులిస్తోన్న ఈ బుడతడిని గుర్తు పట్టారా? ఈ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్ లో ఫేమస్ హీరో. సినిమా నేపథ్యమున్న ఫ్యామిలీ నుంచే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదట సినిమాలోనే విలన్ గా నటించి మెప్పించాడు. అయితే ఆ తర్వా సోలో హీరోగానూ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు. కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా లవ్, యూత్ ఫుల్ ఎంటర్ టైనర్లతో ఆడియెన్స్ ను మెప్పించాడు. ఆ తర్వాత మాస్ హీరోగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. ఈ హీరో స్పెషాలిటీ ఏంటంటే.. ఎలాంటి ఈగోలకు పోడు. ఎలాంటి వివాదాల్లోనూ తల దూర్చడు. అందుకే ఇతర హీరోల సినిమాల్లోనూ తరచూ కనిపిస్తుంటాడు. హీరోగా నటిస్తూనే విలన్ గానూ, సహాయక నటుడిగానూ ఆకట్టుకుంటుంటాడు. జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్న ఈ హీరోకు సామాజిక స్పృహ కూడా ఎక్కువే. అందుకే తాను సంపాదించిన దాంట్లో కొంత భాగం సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నాడు. మరి అందమైన మనసు ఉన్న ఈ ట్యాలెంటెడ్ హీరోను గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే సమాధానం మేమే చెబుతాం లెండి. పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు సందీప్ కిషన్.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుమారుడు జేసన్ విజయ్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా సిగ్మా. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ శుక్రవారం (అక్టోబర్ 02) న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ కు సంబంధించిన చిన్ననాటి ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఈ హీరో ప్రముఖ కెమెరామేన్ చోటా కే నాయుడుకు మేనల్లుడు అవుతాడన్న సంగతి అందరికీ తెలిసిందే.
ఇక సిగ్మా విషయానికి వస్తే.. ప్రతిష్ఠాత్మక లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు. సందీప్ కిషన్ సరసన ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది. రాజు సుందరం, సంపత్ రాజ్ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజవుతోన్న సిగ్మా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
Tamil Nadu Bookings Open Now 🧿#SIGMA ♥️
A Jason Sanjay Debut Directorial 🔥 pic.twitter.com/97hmXzdrZh— Sundeep Kishan (@sundeepkishan) September 30, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి