Gollapudi Maruthi Rao: చంద్రమోహన్ నా పీక నొక్కి చంపేయాలని ఉందన్నాడు.. కారణం ఇదే.. గొల్లపూడి కామెంట్స్..

గొల్లపూడి మారుతిరావు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, రచయితగా ఎదురైన సవాళ్లు, నటుడిగా మారిన వైనంపై పంచుకున్నారు. నటన సులువుగా పాపులారిటీని తెచ్చిపెట్టిందని, అయితే "నటుడు నాలోని రచయితను నాశనం చేశాడు" అని ఆయన వాపోయారు. భారతీయ సినిమాలో మునుపెన్నడూ లేని విలక్షణమైన, సూక్ష్మమైన ప్రతినాయక పాత్రలను తాను ఎలా సృష్టించారో వివరించారు.

Gollapudi Maruthi Rao: చంద్రమోహన్ నా పీక నొక్కి చంపేయాలని ఉందన్నాడు.. కారణం ఇదే.. గొల్లపూడి కామెంట్స్..
Gollapudi Maruthi Rao, Chan

Updated on: Jun 10, 2026 | 8:12 PM

తెలుగు సినిమా చరిత్రలో గొల్లపూడి మారుతిరావు పేరు ఒక రచయితగా, నటుడిగా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో, ఆయన తన సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని, ముఖ్యంగా రచనా వ్యాసంగం నుండి నటన వైపు మళ్లిన వైనాన్ని, తన విలక్షణమైన ప్రతినాయక పాత్రల రూపకల్పనను తెలిపారు. రచయితగా తన ప్రస్థానం కష్టతరమైనదని మారుతిరావు గుర్తు చేసుకున్నారు. కేవీ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం “ఆత్మగౌరవం”కు కథ, మాటలు అందించింది తానేనని, దానికి అవార్డు కూడా వచ్చిందని ఆయన పేర్కొన్నారు. రచనకు ఎంతో ఆలోచన, పరిశోధన అవసరమని, ప్రతి షాట్‌ను, ప్రతి మాటను ఎంతో శ్రద్ధగా రాయాల్సి వచ్చేదని వివరించారు. ఈ క్రమంలో “రచనే మానేశాను” అని చెప్పడం, ఆయన రచన పట్ల ఎంతటి నిబద్ధతతో ఉండేవారో తెలియజేస్తుంది.

అయితే, నటనలోకి ప్రవేశించిన తర్వాత ఆయనకు “పాపులారిటీకి ఒక షార్ట్ సర్క్యూట్” లభించిందని తెలిపారు. “ఇట్ వాస్ ఈజీ ఫర్ మీ,” “నేను చిరునవ్వు నవ్వితే బాగుంది. నేను ఏడిస్తే బాగుంది. నేను కోప్పడితే బాగుంది. ఏమి చేయక్కర్లేదు బుర్ర పనక్కర్లేదు” అంటూ నటన తనకు సులువుగా డబ్బును, కీర్తిని తెచ్చిపెట్టిందని వివరించారు. “ఐ గెట్ టెన్ రూపీస్ మోర్ ఫర్ దిస్. యా ఐ బికమ్ మోర్ పాపులర్” అని పేర్కొంటూ, తనలోని రచయితను నటుడు నాశనం చేశాడని విచారం వ్యక్తం చేశారు.

పైకి ఎంతో సాఫ్ట్‌గా, మర్యాదగా మాట్లాడుతూనే వెన్నుపోటు పొడిచే పాత్రలను ఆయన అలవోకగా పోషించారు. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ వంటి సినిమాల్లో ఆయన ప్రవేశమే దీనికి ఉదాహరణ. చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం 515 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. అలాగే సీనియర్ నటుడు చంద్రమోహన్ , తన మధ్య సాగే విలన్-హీరో సీన్లు ఎంత విచిత్రమైన సంభాషణలతో కూడి ఉండేవో ఆయన నవ్వుతూ గుర్తుచేసుకున్నారు. ఒక సందర్భంలో చంద్రమోహన్ “మిమ్మల్ని పీకనొక్కి చంపేయాలని ఉంది” అని తన నటనను ఉద్దేశించి అన్నారని, దానికి తాను నవ్వినట్లు తెలిపారు. ఒకరినొకరు మర్యాదపూర్వకంగా తిట్టుకుంటూ నవ్వులు పూయించే ఆ శైలి కేవలం గొల్లపూడికే సాధ్యమైంది. తన పరిమితులను తాను తెలుసుకుని, వాటినే బలంగా మార్చుకుని టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన మహానటుడు గొల్లపూడి మారుతీరావు.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: వామ్మో.. ఇదేం క్రేజ్ రా బాబూ.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న పక్కా ఫోక్ సాంగ్.. ఇన్ స్టాలో దుమ్మురేపుతున్న రీల్స్..

ఎక్కువ మంది చదివినవి : Sampath Raj : అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. ఆయన యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయా.. నటుడు సంపత్ రాజ్..

Follow Us