Aalochana: మెగాస్టార్ చిరంజీవి ప్రాణ స్నేహితుడు నటించిన చివరి సినిమా.. ‘ఆలోచన’ రిలీజ్ డేట్ ఫిక్స్

గతంలో నటీనటులుగా ఓ వెలుగు వెలిగిన G.V.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, మహర్షి రాఘవ, జయలలిత, రజన్ హరి, బెన్నీ సుధాకర్ వంటి ఎందరో స్టార్స్ ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు ముస్తాబైంది.

Aalochana: మెగాస్టార్ చిరంజీవి ప్రాణ స్నేహితుడు నటించిన చివరి సినిమా.. ఆలోచన రిలీజ్ డేట్ ఫిక్స్
Alochana Movie

Updated on: Nov 08, 2026 | 3:26 PM

పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం ‘ఆలోచన’. ఈ మూవీలో G.V.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, మహర్షి రాఘవ, జయలలిత, రజన్ హరి, బెన్నీ సుధాకర్ వంటి వారు కీలక పాత్రలో, సుజనా,అనుపమ స్వాతి, మాధవి, అద్వైక జెస్సీ, హసిత, జెన్నీ,ప్రసాద్ రామ్, నరేంద్ర, ముఖ్య పాత్రల్లో నటించారు. దీపావళి సందర్భంగా ‘ఆలోచన’ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్‌ను వినూత్నంగా వృద్దాశ్రమంలో వందలాదిమంది సీనియర్ సిటిజన్స్ సమక్షంలో లాంచ్ చేశారు. నవంబర్ 27న ‘ఆలోచన’ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ ప్రపంచవ్యాప్తంగా చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకులు సురేందర్ చాచా, నిర్మాతలు ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్, సీనియర్ నటి జయలలిత, సుజనా, అనుపమ స్వాతి, హసిత, సురేష్ కొండేటి పాల్గొన్నారు అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో.. ముందుగా సీనియర్ నటి జయలలిత మాట్లాడుతూ .. ‘‘ఆలోచన’ చిత్రంలో సంగీతం టీచర్‌గా శ్యామల అనే పాత్రను పోషించాను. నా భర్తగా అంధుడి పాత్రలో మహర్షి రాఘవ గారు. అంధుడైన ఆయన వయోలిన్ మాస్టర్‌గా ఈ చిత్రంలో కనిపిస్తారు. ‘భజ గోవిందం’ పాట అద్భుతంగా ఉంటుంది. దర్శక, నిర్మాతలు కష్టపడి ఈ సినిమాని చేశారు. ఈ మూవీ నాకు ఎంత సంతృప్తినిచ్చింది. మా ఈ ‘ఆలోచన’ మూవీని అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నిర్మాత ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ .. ‘దర్శకుడు చాచాతో నాకు ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉంది. ఎప్పుడూ ఏదో ఒక కథ గురించి చర్చిస్తూ ఉండేవాళ్లం. అలాంటి టైంలోనే ‘ఆలోచన’ కథను చెప్పాడు. ఆ టైంకి మాకు శ్రీనివాస్ గారు కూడా అండగా నిలిచి చేద్దాము అని అన్నారు. అప్పుడే మొదలయింది.

నిర్మాత గుండబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ .. ‘‘చాచా నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. ఓ ఆర్ట్ ఫిల్మ్‌గా చేయాలని ‘ఆలోచన’ గురించి చెప్పారు. ఓల్డ్ ఏజ్ పీపుల్స్ చుట్టూ జరిగే ఈ కథ ఎంతో హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. ‘ఆలోచన’లోని కాన్సెప్ట్, పాయింట్ నాకెంతో నచ్చింది. సీనియర్ ఆర్టిస్టుల నటన గొప్పగా ఉంటుంది. అందరిలోనూ ఆలోచన రేకెత్తించేలా మా సినిమా ఉంటుంది’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి

దర్శకుడు సురేందర్ చాచా మాట్లాడుతూ .. ‘‘ఆలోచన’ చిత్రంలో సీనియర్ ఆర్టిస్టులంతా గొప్పగా నటించారు. అందరూ తమ తమ పాత్రల్లో జీవించారు. అందరూ పోటీ పడి మరీ నటించారు. ఈ కథను ముందుగా నారాయణ రావు గారికే వినిపించాను. ఆ టైంలో ఆయన కనీసం లేవలేని స్థితిలో ఉన్నారు. స్క్రిప్ట్ ఇక్కడే పెట్టు.. రెండ్రోజుల తర్వాత ఫోన్ చేస్తా అని ఆయన అన్నారు. కథ అద్భుతంగా ఉందని పొగిడారు. ఆయనే ఒక్కో ఆర్టిస్టుకి ఫోన్ చేసి మరీ చెప్పారు. ఈ విషయం లో ప్రదీప్, శ్రీనివాస్ నాకు ఎంతో సహకరించారు. నవంబర్ 27న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

 

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us