Naga Durga: ఎంతో అదృష్టం ఉంటే కానీ ఆ పాట రాదు.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాంగ్ పై నాగ దుర్గ రియాక్షన్..

ఫోక్ డాన్సర్ నాగదుర్గ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో తన అద్భుతమైన డ్యాన్స్ వీడియోలు, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆమె భారీ క్రేజ్ సంపాదించుకుంది. నాగదుర్గ తన గ్లామర్, టాలెంట్‌తో ఒక సెలబ్రిటీ హోదాను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఆమెకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. సినిమా హీరోయిన్లతో సమానంగా ఆమె ఇంటర్వ్యూలు, ఈవెంట్లలో పాల్గొంటోంది.

Naga Durga: ఎంతో అదృష్టం ఉంటే కానీ ఆ పాట రాదు.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాంగ్ పై నాగ దుర్గ రియాక్షన్..
Naga Durga

Updated on: May 26, 2026 | 10:20 PM

ప్రస్తుత రోజుల్లో సినిమా పాటలతో సమానంగా జానపద గీతాలు (ఫోక్ సాంగ్స్) ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి, భాషా ప్రాధాన్యతతో రూపొందుతున్న జానపద పాటలు సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తూ ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సరికొత్త ఫోక్ సాంగ్ ‘నా పేరే ఎల్లమ్మ’. ఈ పాటలో తన అద్భుతమైన నటన, డ్యాన్స్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది ప్రముఖ ఫోక్ డాన్సర్ నాగదుర్గ. చూడచక్కని రూపం, అద్భుతమైన డ్యాన్స్ తో హీరోయిన్లకు సైతం పోటీనిచ్చే స్థాయిలో ఈమె క్రేజ్ సంపాదించుకుంది. కాగా, ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో నాగదుర్గ ఈ పాట గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ హీరో చాలా అందగాడు.. టాలెంట్ ఉంది.. కానీ స్టార్ హీరో కాలేకపోయాడు.. ఎక్కడ తప్పు చేశాడంటే..

తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఘనంగా జరుపుకునే బోనాల పండుగ కోసం ‘నా పేరే ఎల్లమ్మ’ అనే ప్రత్యేక జానపద గీతాన్ని రూపొందించారు. ఈ పాటలో నటించే అవకాశం రావడంపై నాగదుర్గ తీవ్ర సంతోషాన్ని వ్యక్తం చేసింది. “ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ నాకు ఈ పాటలో నటించే అవకాశం రాలేదు. ‘నా పేరే ఎల్లమ్మ, నేను జోగురాలమ్మ, అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలంటి’ వంటి అద్భుతమైన పదాలతో సాగే ఈ పాటలో భాగం కావడం నా పూర్వజన్మ సుకృతం” అంటూ ఆమె భావోద్వేగానికి లోనైంది. ఈ అవకాశం తనకు ఒక మరువలేని, ఓవర్‌వెల్మింగ్ అనుభూతిని ఇచ్చిందని ఆమె తెలిపింది.

ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఆ హీరోయిన్ నాకు చాలా స్పెషల్.. నటనలో ఆమె నాకు పోటీగా ఉండేది.. హీరో శ్రీకాంత్..

తెలంగాణ సంస్కృతి, జానపద సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఎల్లమ్మ తల్లికి అంకితంగా వచ్చిన ఈ పాట బోనాల ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేవలం ఆడియో పరంగానే కాకుండా, విజువల్స్ పరంగా కూడా ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ సాంగ్, ఇప్పటికే యూట్యూబ్‌లో 102 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. ఈ పాట ద్వారా నాగదుర్గకు ఇండస్ట్రీలో , ప్రేక్షకుల్లో మరింత గుర్తింపు లభించింది. జానపద కళల పట్ల, సంస్కృతి పట్ల ఉన్న గౌరవమే ఈ పాటను ఇంత పెద్ద హిట్ చేసిందని చెప్పవచ్చు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : జయం సినిమాను మిస్ అయ్యింది.. లేదంటే ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యేది.. యాంకరమ్మ బ్యాడ్ లక్..

నా పేరే ఎల్లమ్మ సాంగ్..

ఎక్కువ మంది చదివినవి : Rambha : మైఖేల్ జాక్సన్ పక్కన ఉన్నా నాకు ఆ హీరోనే బెస్ట్ డ్యాన్సర్.. హీరోయిన్ రంభ..

Follow Us