
న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. నాని గారి క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. దర్శకుడు శ్రీకాంత్ గారు చాలా కొత్తగా డిజైన్ చేశారు. రెండు జడలు వేసుకున్న హీరోను ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు చూడలేదు. మాకు కూడా అది చాలా కొత్తగా అనిపించింది. నాని గారు ప్రేక్షకులకు కొత్తదనం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. నాని గారు ఈ స్థాయిలో యాక్షన్ చేయడం ఇదే మొదటిసారి. ఇందులో యాక్షన్ సీన్స్ చాలా హెవీగా ఉంటాయి. ‘దసరా’ కంటే మూడు రెట్లు ఎక్కువ యాక్షన్ ఉంటుంది.
జడలతో యాక్షన్ సీక్వెన్స్ చేయడం మామూలు విషయం కాదు. యాక్షన్ చేస్తున్నప్పుడు ఆ జడలు రూప్‌లకు, ముఖానికి తగులుతుంటాయి. అలాంటి యాక్షన్ సీక్వెన్స్ చేయడం మాకు కూడా కొత్త అనుభవమే. మా అసిస్టెంట్‌కు కూడా అలాంటి జడలు వేయించి అందులో ఉండే కష్టం తెలుసుకుని మరీ యాక్షన్‌ను కంపోజ్ చేశాం. నాని గారి కెరీర్‌లోనే ఇంత కష్టం ఎప్పుడూ పడలేదు. ప్రతి విషయంలో తన 100 శాతం కష్టపడ్డాడు. ఎన్ని టేక్స్ అయినా చేయాలని మనసులో ఫిక్స్ అయ్యాడు. నిజంగా నాని ఇంత కష్టపడతాడని మేం ఊహించుకోలేదు. అంత గొప్పగా ఈ సినిమా కోసం కష్టపడ్డాడు అన్నారు.
నాని బేర్ బాడీతో చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయి. అవి స్క్రీన్‌పై చేయడం అంత ఈజీ కాదు. బాడీ బిల్డింగ్ చేయాలి. డైటింగ్‌లో ఉండాలి. ఇందులోనూ దర్శకుడు శ్రీకాంత్ తనకు అనుకున్నది వచ్చేంతవరకు రాజీపడరు. శ్రీకాంత్ తీసుకున్న విజన్‌కు నాని 100 శాతం న్యాయం చేశారు. అందులో మేం భాగమవడం అదృష్టంగా భావిస్తున్నాం. మా యాక్షన్ బ్లాక్స్ పూర్తి చేయడానికి దాదాపు పది రోజులు పట్టింది. ఇందులో కొత్త మనుషులు, కొత్త బాడీ లాంగ్వేజ్.. అంతా కొత్తగానే ఉంటుంది. దర్శకుడు శ్రీకాంత్ ఎంచుకున్న కథ సహజంగానే యాక్షన్‌ను డిమాండ్ చేస్తుంది. ఇందులో తప్పించుకోవడానికి అవకాశం ఉండదు.. ఫైట్ చేయాల్సిందే. అలాంటి పరిస్థితిని శ్రీకాంత్ క్రియేట్ చేశారు. యాక్షన్‌ను కంపోజ్ చేయడానికి చాలా సమయం తీసుకున్నాం. ఎందుకంటే ఇలాంటి బాడీ లాంగ్వేజ్‌తో సినిమా ఇంతకుముందు రాలేదు. అందుకే చాలా కేర్ తీసుకుని చేశాం. ఇందులో చాలా రిస్కీ యాక్షన్ ఉంటుంది. షూటింగ్ సమయంలో మా యూనిట్‌లో ఒకరికి గాయం కూడా అయింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.