Fauji Movie: ప్రభాస్ ఫౌజీ మూవీ టీమ్‌కు రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, పలువురికి గాయాలు

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రం ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్ గా నటిస్తోంది. మిథున్‌ చక్రవర్తి, జయప్రద, అనుపమ్‌ ఖేర్‌, రాహుల్‌ రవింద్రన్‌ తదితర స్టార్స్ వివిధ పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది.

Fauji Movie: ప్రభాస్ ఫౌజీ మూవీ టీమ్‌కు రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
Prabhas

Updated on: May 05, 2026 | 12:37 PM

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఫౌజీ. టాలీవుడ్ హిట్ డైరెక్టర్ హనురాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఫౌజీ చిత్రయూనిట్ కు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలో జరిగిన ఈ ఘటన జరిగిందని తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ప్రొడక్షన్ యూనియన్‌కు చెందిన ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద వార్తతో ప్రభాస్ అభిమానులు,  చిత్రయూనిట్ దిగ్బ్రాంతికి గురయ్యారు. ఫౌజీ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతుంది. వరుస సినిమాలను లైనప్ చేసిన ప్రభాస్ ఫౌజీ చిత్రషూటింగ్ లో పాల్గొంటున్నారు.

ఇది కూడా చదవండి : Jagapathi Babu: ఆ సినిమా నుంచి చెప్పాపెట్టకుండా తీసేశారు.. చాలా బాధ అనిపించింది

ఫౌజీ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఫౌజీ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్ గా నటిస్తోంది. మిథున్‌ చక్రవర్తి, జయప్రద, అనుపమ్‌ ఖేర్‌, రాహుల్‌ రవింద్రన్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు.  అబ్దుల్లాపూర్‌మెట్ లో షూటింగ్ నిమిత్తం వెళ్తుండగా చిత్రయూనిట్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. రోడ్డు పక్కన ఉన్న డివైడర్ ను కారు ఢీ కొట్టింది.

ఇది కూడా చదవండి :వారికి కోరికలు చాలా తక్కువ..! అందుకే వాళ్లు అలా ఉన్నారు.. మనం ఇలా ఉన్నాం: పూరిజగన్నాథ్

ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.. పలువురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తలరించి చికిత్స అందించారు. ఈ ప్రమాదం పై  చిత్ర యూనిట్ సభ్యులు, చిత్ర నిర్మాతలు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయం చేయడానికి చిత్రనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది.

ఇది కూడా చదవండి :నా గుండు వెనక అసలు కథ ఇదే.. షాకింగ్ విషయం చెప్పిన కమెడియన్ సుదర్శన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us