రీల్‌లో కనిపించే ఎమోషనల్ సీన్స్… అల్లు అర్జున్ అరెస్ట్‌తో రియల్‌గా కనిపించాయ్. ఫస్ట్ పోలీసులు ఇంటికి రాగానే ఎంతో టెన్షన్ పడ్డారు అల్లు అర్జున్ భార్య స్నేహ. ఏం జరుగుతుందోనన్న భయంతో అల్లు అర్జున్ వెంటనే ఉన్నారామె. ఇక అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పటం… అక్కడ జరుగుతున్న పరిణామాలను చూసి ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంట్లోంచి బయటకు వచ్చేవరకూ ఏడ్చుకుంటూనే ఉన్నారు. అయితే ఆమెకు ధైర్యం చెప్పి పోలీస్ వెహికిల్ ఎక్కారు బన్నీ.
ఇటు అల్లు అరవింద్ కూడా టెన్షన్ టెన్షన్‌గా కనిపించారు. అరెస్ట్ అవుతున్న కొడుకుని చూసి ఏమవుతుందోన్న భయం ఆయనలో క్లియర్‌గా కనిపించింది. నేను వస్తానంటూ… అల్లు అర్జున్ కంటే ముందే పోలీస్ వెహికిల్ ఎక్కి కూర్చున్నారాయన. దీంతో తండ్రి కొడుకుల మధ్య అక్కడ ఎమోషనల్ కాన్వర్జేషన్ జరిగింది. ఏం కాదు నేను వస్తానని అరవింద్ అంటే… మంచి జరిగినా, చెడు జరిగినా నాదే బాధ్యత, మీరు వెహికిల్ దిగండి నాన్న అంటూ బన్నీ చెప్పడం ఎమోషన్ హై ఇచ్చింది. అంతేకాదు అర్జున్‌ని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి ఫాలో అయ్యారు అరవింద్.
ఇక విషయం తెలుసుకున్న చిరంజీవి సైతం షాక్ అయ్యారు. సినిమా షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ తన సతీమణి సురేఖతో కలిసి అల్లు అర్జున్ ఇంటికి హుటాహుటిని వెళ్లారు. అల్లు ఫ్యామిలీని పరామర్శించి అండగా నిలిచారు.
దిల్‌రాజు, త్రివిక్రమ్‌తో పాటు పలువురు నిర్మాతలు, దర్శకులు కూడా అర్జున్ అరెస్ట్‌తో బయటకొచ్చారు. అటు గాంధీ ఆస్పత్రికి… ఇటు హైకోర్టుకు బన్నీ వెహికిల్ వెంటే తిరిగారు. పుష్ప డైరెక్టర్ సుకుమార్, బెస్ట్ ఫ్రెండ్ రానా కూడా ఇంటికెళ్లి అల్లు ఫ్యామిలీని పరామర్శించారు.
అల్లు అర్జున్‌కి బెయిల్ వచ్చిందన్న వార్త వినగానే ఆయన మామగారు భావోద్వేగానికి గురయ్యారు. బెయిల్ వచ్చినందుకు సంతోషంగా ఉందంటూనే ఉద్వేగానికి లోనయ్యారు. తమ అభిమాన నటుడు అరెస్ట్ అవ్వడంతో ఇటు ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందారు. కోర్టు నుంచి చంచల్‌గూడ జైలుకు అల్లు అర్జున్‌ని తీసుకెళ్తుండగా… రోడ్డుకు ఇరువైపులా బన్నీ బన్నీ అంటూ నినాదాలు చేశారు. బెయిల్ మంజూరవ్వగానే… ఫుల్ ఖుష్ అయ్యారు ఫ్యాన్స్. మొత్తంగా… అల్లు అర్జున్ అరెస్ట్ ఎన్నో ఎమోషన్స్‌ని చూపించిందనే చెప్పాలి… !
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.