Kasthuri : తెలుగు వాళ్ళతో పెట్టుకుంటే అంతే మరి.. పరారీలో నటి కస్తూరి.. మాజీ సీఎం ఇంటి ముందు నిరసన

| Edited By: Rajeev Rayala

Nov 12, 2024 | 2:08 PM

ఎక్కడ చెన్నై... ఎక్కడ చెరువుకొమ్ముపాలెం... అట్లుంటది సినీ, రాజకీయ నేతల విషయంలో అభిమానమైనా, ఆగ్రహమైనా.. సినీ నటి కస్తూరికి వ్యతిరేకంగా మాజీ సియం కరుణానిధి ఇంటి ముందు నిరసన ప్రదర్శన...

Kasthuri : తెలుగు వాళ్ళతో పెట్టుకుంటే అంతే మరి.. పరారీలో నటి కస్తూరి.. మాజీ సీఎం ఇంటి ముందు నిరసన
Actress Kasthuri
Follow us on

ప్రకాశంజిల్లా చెరువుకొమ్ముపాలెంలోని దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి పూర్వీకుల ఇంటి ముందు సినీ నటి కస్తూరికి వ్యతిరేకంగా ద్రవిడ దేశంపార్టీ ఆధ్వర్యంలో బిసి సంఘాల నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు.. శిధిలావస్తలో ఉన్న కరుణానిధి పూర్వీకుల ఇంటి ముందు కస్తూరి ఫోటోలను దగ్దం చేశారు.. సినీనటి కస్తూరి చెన్నైలో ఒక సభలో మాట్లాడుతూ 300 సంవత్సరాల క్రితం అంతఃపురంలోని రాణులకు సేవ చేయటం కోసం తెలుగువారు తమిళనాడుకు వలస వచ్చారని చేసిన వ్యాఖ్యలపై తమిళనాడులో దుమారం రేగింది.. తమిళనాడులోని తెలుగు సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే తెలుగు సంఘాల ఫిర్యాదు మేరకు చెన్నై ఎగ్మోర్‌లో పోలీసులు కస్తూరిపై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు..

ఈ నేపధ్యంలో సినీనటి కస్తూరిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రకాశంజిల్లాలోని చెరువుకొమ్ముపాలెం గ్రామంలోని దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి పూర్వీకుల ఇంటి ముందు చెన్నై నుంచి వచ్చిన ద్రవిడ దేశంపార్టీ నేతలు స్థానిక బిసి సంఘాల నేతలతో కలిసి ఆందోళన చేశారు.. తెలుగువారిని కించపరుస్తూ అవహేళనగా మాట్లాడి ప్రస్తుతం పరారీలో ఉన్న సినీనటి కస్తూరిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.. కరుణానిధి పూర్వీకులు నివసించిన చెరువుకొమ్ముపాలెం సచివాలయం దగ్గర ద్రవిడ దేశం పార్టీ తరఫున నిరసన కార్యక్రమం చేపట్టారు.. ఈ కార్యక్రమంలో ద్రావిడ దేశం జాతీయ అధ్యక్షుడు వి. కృష్ణారావుతో పాటు ప్రకాశంజిల్లాలోని పలు బిసి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

చెన్నైలో ఇటీవల హిందూ మక్కల్ కట్చి నిర్వహించిన సభలో బ్రాహ్మణుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని సినీ నటి కస్తూరి మాట్లాడుతూ తెలుగు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలుగు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.. కస్తూరి వ్యాఖ్యలపై తమిళనాడులోని తెలుగు సంఘాలు, ఇతర తెలుగు ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ చెన్నైలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.. దీంతో ఆమెపై చెన్నైలో కేసు నమోదైంది.. ఈనెల 10న ఆమెపై కేసు నమోదు చేసిన ఎగ్మోర్‌ పోలీసులు ఆమెకు సమన్లు ఇచ్చేందుకు ఇంటికి వెళ్ళగా తాళం వేసి ఉంది.. కస్తూరిని ఫోన్‌లో కాంటాక్ట్‌ చేసేందుకు ప్రయత్నించగా ఆమె ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ రావడంతో ఆమె పరారీలో ఉన్నట్టు తమిళనాడు పోలీసులు భావిస్తున్నారు.. ఈ క్రమంలో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ కస్తూరి కోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.