Tollywood : ఈ ఫొటోలో పువ్వు వెనక దాగిఉన్న పూబంతి ఎవరో గుర్తుపట్టారా..?

సోషల్ మీడియాలో అందాల భామ ఫోటోలు ఎంతగా వైరల్ అవుతాయో అందరికి తెలిసిందే. అలాగే కొన్ని సినిమా పజిల్స్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఆ హీరోయిన్ ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాటెండ్ హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే అయినా.. విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.

Tollywood : ఈ ఫొటోలో పువ్వు వెనక దాగిఉన్న పూబంతి ఎవరో గుర్తుపట్టారా..?
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 24, 2023 | 9:29 AM

జనాల మీద సినిమాల ప్రభావం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక హీరోయిన్స్ కు మాత్రం ఫ్యాన్స్ గుడి కూడా కట్టేస్తారు. సోషల్ మీడియాలో అందాల భామ ఫోటోలు ఎంతగా వైరల్ అవుతాయో అందరికి తెలిసిందే. అలాగే కొన్ని సినిమా పజిల్స్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఆ హీరోయిన్ ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాటెండ్ హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే అయినా.. విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు వరుస సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో బిజీగా మారిపోయింది. ఈ భామ కూడా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి వచ్చింది. ఇంతకు ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా..? ఆమె ను కనిపెట్టడం అంత కష్టమేమి కాదు..

పై ఫొటోలో పువ్వు వెనక దాగి ఉన్న పూబంతి మరెవరో కాదు.. ఆమె మృణాల్ ఠాకూర్. సీరియల్స్ నుంచి సినిమా ఇండస్ట్రీలోకి అడుగులేసింది. ఆతర్వాత జెర్సీ సినిమా తో బాలీవుడ్ లో హిట్ అందుకుంది. ఇక తెలుగులో మృణాల్ సీతారామం సినిమాతో పరిచయం అయ్యింది.

హనురాఘవాపుడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమాలో హీరోయిన్ గా నటించింది. తొలి సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ భామ టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. నాని హీరోగా నటిస్తున్న హాయ్ నాన్న సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ మ్యాన్ సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తుంది మృణాల్. ఇక ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సినిమాల్లో పద్దతిగా కనిపించే మృణాల్ సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోజులతో మతిపోగొడుతోంది.

మృణాల్ ఠాకూర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మృణాల్ ఠాకూర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..