ముట్టుకుంటే మాసిపోతుంది.. పట్టుకుంటే కందిపోతుంది..! అందానికి ఆధార్ కార్డు ఈ అమ్మడు

|

Jul 27, 2024 | 6:23 PM

ముద్దుగుమ్మల ఫోటోలను అభిమానులు చాలా పదిలంగా దాచుకుంటుంటారు. ఇక సోషల్ మీడియాలో నిత్యా వందల ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. తమ ఫెవరెట్ హీరోయిన్ పిక్స్ ను తెగ షేర్ చేస్తూ సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ క్రేజీ బ్యూటీ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. పై ఫొటోలో ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.?

ముట్టుకుంటే మాసిపోతుంది.. పట్టుకుంటే కందిపోతుంది..! అందానికి ఆధార్ కార్డు ఈ అమ్మడు
Mamitha Baiju
Follow us on

సినిమా వాళ్లకు సంబందించిన ఫోటోలు నెట్టింట కోకొల్లలుగా దర్శనమిస్తుంటాయి. ఇక హీరోయిన్స్ ఫోటోల గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. ముద్దుగుమ్మల ఫోటోలను అభిమానులు చాలా పదిలంగా దాచుకుంటుంటారు. ఇక సోషల్ మీడియాలో నిత్యా వందల ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. తమ ఫెవరెట్ హీరోయిన్ పిక్స్ ను తెగ షేర్ చేస్తూ సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ క్రేజీ బ్యూటీ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. పై ఫొటోలో ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.? గులాబీ రేకుల్లాంటి ఒళ్ళు, కలువల్లాంటి కళ్ళు, ఆమె నవ్విందంటే హరివిల్లు విరిసినట్టు ఉంటుంది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? చేసింది తక్కువ సినిమాలే కానీ కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. ఏ కుర్రాడి ఫోన్ చూసిన ఆమె ఫోటోనే వాల్ పేపర్ పెట్టుకుంటున్నారు. ఇంతకు ఆ వయ్యారి ఎవరో గుర్తుపట్టారా.?

ఇది కూడా చదవండి : హైపర్ ఆది వల్లే నేను జబర్దస్త్ మానేశా..? ఇప్పుడు సినిమాల్లో అలాంటి పాత్రలు ఇస్తామంటున్నారు..

పై ఫొటోలో ప్రేకృతితో దోబూచులాడుతున్న ఆ అమ్మడు మరెవరో కాదు ప్రేమలు సినిమాతో కుర్రాళ్ళ మనసు దోచేసిన మమిత బైజు. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ అమ్మడు తన క్యూట్ నెస్ తో ప్రేక్షకులను కవ్వించింది. 2017లో సర్వోపరి పాలక్కారన్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఖో ఖో చిత్రంలో తన నటనకు ఉత్తమ సహాయ నటిగా కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్ గెలుచుకుంది.

ఇది కూడా చదవండి : Raviteja : ఒరేయ్ ఆజామో.. మన మాస్ రాజా కూతురు మెంటలెక్కించిందిగా..!!

సినిమాలతో పాటు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటించింది ఈ అమ్మడు. ఇక మమితా నటించిన ప్రేమలు సినిమా మలయాళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అదే సినిమాను అదే టైటిల్ తో తెలుగులోనూ విడుదల చేశారు. తెలుగులోనూ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తన నటనతో , అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది మామిత. ఇక ఇప్పుడు ఈ అమ్మడు తెలుగులో సినిమా చేస్తుందని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోన్న కొత్త సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్ గా చేస్తుందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

మమితా బైజు ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి