Jabardasth Nihanth: జబర్దస్త్ నిహాంత్ గుర్తున్నాడా? ఇప్పుడు హీరోలా మారిపోయాడు.. ఏం చేస్తున్నాడంటే?

జబర్దస్త్ ద్వారా ఎంతో మంది ట్యాలెంటెడ్ ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు వారంతా సినిమాల్లో బిజీ బిజీగా ఉంటున్నారు. ఇదే జబర్దస్త్ కామెడీ షోలో ఛైల్డ్ ఆర్టిస్టులుగా పార్టిసిపేట్ చేసి కొందరు బుడతలు కూడా బాగా ఫేమస్ అయ్యారు. అందులో నిహాంత్ కూడా ఒకడు.

Jabardasth Nihanth: జబర్దస్త్ నిహాంత్ గుర్తున్నాడా? ఇప్పుడు హీరోలా మారిపోయాడు.. ఏం చేస్తున్నాడంటే?
Jabardasth Nihanth

Updated on: May 21, 2026 | 6:55 PM

2013లో ప్రారంభమైన జబర్దస్త్ కామెడీ షో ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉంది. ఎంతో మంది ట్యాలెంటెడ్ ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూనే ఉంది. ఈ షోలో పార్టిసిపేట్ చేసిన వారందరూ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో బిజీ బిజీగా ఉంటున్నారు. డైరెక్టర్లుగా, హీరోలుగా, సహాయక నటులుగా, కమెడియన్లుగా, నిర్మాతలుగా రాణిస్తున్నారు.ఇదే జబర్దస్త్ ఎంతో మంది ఛైల్డ్ ఆర్టిస్టులను కూడా ఎంకరేజ్ చేసింది. యోధ, నిహాంత్, దీవెన, నరేష్, నెమలి రాజు వంటి ఛైల్డ్ ఆర్టిస్టులు ఈ కామెడీ షో ద్వారానే వెలుగులోకి వచ్చారు. తమ బుల్లి బుల్లి డైలాగులతో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. వీరిలో కొందరు ఇప్పటికీ జబర్దస్త్ షోలో కంటిన్యూ అవుతుంటే మరికొందరు మాత్రం ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. ఇంకొందరు సినిమాల్లో నటిస్తున్నారు. అలా జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఛైల్డ్ ఆర్టిస్టుల్లో నిహాంత్ ఒకడు. బొద్దుగా కనిపించే ఈ బుడతడు జబర్దస్త్ లో చేసిన సందడి అంతా ఇంత కాదు. మరి ఇప్పుడు ఈ నిషాంత్ ఎలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడో తెలుసుకుందాం రండి.

 

నిహాంత్ హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాడు. అతనికి ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ల అమ్మ గారి తో కలిసి ఒక షూటింగ్ కి వెళ్లాడట. అక్కడ ఒక సీరియల్ డైరెక్టర్ నిహాంత్ ను చూశాడట. ఆ వెంటనే అతని పేరెంట్స్ సమ్మతం తీసుకుని తన సీరియల్ లో ఛైల్డ్ ఆర్టిస్ట్ రోల్ కోసం నిహాన్ ను తీసుకున్నాడట. అలా శ్రీనివాస కళ్యాణం సీరియల్ తో నిహంత్ యాక్టింగ్ కెరీర్ మొదలైంది. ఆ తర్వాత సీతా మహాలక్ష్మీ ధారావాహికలోనూ ఓ కీలక పాత్రలో యాక్ట్ చేశాడీ కుర్రాడు. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోలోకి అడుగు పెట్టాడు. చాలా ఏళ్ల పాటు తన ముద్దు ముద్దు మాటలతో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. అలాగే కొన్ని సినిమాల్లోనూ కనిపించాడు. నిన్ను కోరి, మీలో ఎవరు కోటీశ్వరుడు తదితర సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ లో నిషాంత్ నటించాడు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం తన ఉన్నత చదువులను పూర్తి చేసే పనిలో ఉన్నాడు నిషాంత్. అదే సమంయలో యాక్టింగ్, డ్యాన్స్, మ్యూజిక్ కీ బోర్డులో శిక్షణ తీసుకుంటున్నాడు. టీవీ షోస్ కు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నాడు నిహాంత్. తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి డ్యాన్స్ వీడియోలు, ఇన్ స్టా రీల్స్ చేస్తున్నాడు. ఇవి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే జబర్దస్త్ చేసే నాటికీ, ఇప్పటికీ చాలా మారిపోయాడు నిహాంత్. అప్పటిలాగా బొద్దుగానే ఉన్నా మరింత క్యూట్ గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం నిహాంత్ ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు సినిమాల్లోకి ఎప్పుడొస్తావ్‌ నిహాంత్? అంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు.

జబర్దస్త్ నిశాంత్ లేటెస్ట్ ఫొటోస్..

Jabardasth Nihanth Latest Photos

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us