ఒక్క వివాదం.. దెబ్బకు కెరీర్ కొలాప్స్..! పెళ్ళైన హీరోతో యవ్వారం.. ఇండస్ట్రీ నుంచి బ్యాన్

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగడం చాలా కష్టం. కొంతమంది కష్టపడి అవకాశాలు అందుకుంటూ హీరోయిన్ గా నిలదొక్కకుంటున్నారు. మరి కొంతమంది తొలి సినిమాతో హిట్ అందుకున్నా.. ఆ తర్వాత హీరోయిన్ గా కొనసాగడానికి కష్టపడుతున్నారు. అయితే ఈ హీరోయిన్ మాత్రం తన చేతులారా సినీ కెరీర్ ను నాశనం చేసుకుంది.

ఒక్క వివాదం.. దెబ్బకు కెరీర్ కొలాప్స్..! పెళ్ళైన హీరోతో యవ్వారం.. ఇండస్ట్రీ నుంచి బ్యాన్
Actress

Updated on: Sep 26, 2026 | 12:27 PM

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోవడం ఎంత కష్టమో.. వచ్చిన అవకాశాలను నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. కొంతమంది నటీనటులు వరుస విజయాలతో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంటే.. మరికొందరి కెరీర్ మాత్రం అనుకోని పరిణామాలతో ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. అలాంటి వారిలో హీరోయిన్ నిఖిత పేరు కూడా వినిపిస్తుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఒకప్పుడు వరుస అవకాశాలతో బిజీగా కనిపించింది. అయితే ఓ వివాదం ఆమె కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. నిఖిత 2002లో వచ్చిన హాయ్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కళ్యాణ రాముడు సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత సంబరం, ఖుషీ ఖుషీగా, ఏవండోయ్ శ్రీవారు, మహారాజశ్రీ వంటి చిత్రాల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాగార్జున హీరోగా తెరకెక్కిన డాన్ సినిమాలోనూ సెకండ్ హీరోయిన్‌గా నటించింది.

సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

తెలుగుతో పాటు తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమల్లోనూ నిఖితకు అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా కన్నడలో పలు సినిమాలు చేస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్‌గా కెరీర్ మంచి ఊపులో ఉన్న సమయంలోనే ఆమె వ్యక్తిగత జీవితం చుట్టూ ఓ వివాదం తెరపైకి వచ్చింది. కన్నడ నటుడు దర్శన్‌తో నిఖిత సన్నిహితంగా ఉన్నారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ సమయంలో దర్శన్ ఇప్పటికే వివాహం అవ్వడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ విషయం దర్శన్ భార్య విజయలక్ష్మి వరకు వెళ్లడంతో వివాదం మరింత పెద్దదైంది. ఆమె పోలీసులను ఆశ్రయించడంతో దర్శన్ అరెస్టయ్యాడు. ఈ ఘటన అప్పట్లో కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం రేపింది.

ఇవి కూడా చదవండి

16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..! అప్పుడు తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి

ఈ వివాదం ప్రభావం నిఖిత సినీ కెరీర్‌పైన గట్టిగానే పడింది. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఆమెపై కొంతకాలం నిషేధం విధించింది. ఆ తర్వాత నిషేధం ఎత్తేసిన.. అవకాశాలు మాత్రం దక్కలేదని కథనాలు వెలువడ్డాయి. కెరీర్ ప్రారంభంలో మంచి అవకాశాలు అందుకున్న నిఖిత.. ఆ తర్వాత క్రమంగా సినిమాలకు దూరమైంది. 2017లో వ్యాపారవేత్త గగన్‌దీప్ సింగ్ మాగోను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కుటుంబ జీవితానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న ఆమె.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న నిఖిత.. ఇప్పుడు తెరపై పెద్దగా కనిపించకపోయినా, ఆమె నటించిన సినిమాలు, కెరీర్‌లో చోటుచేసుకున్న వివాదాలు మాత్రం ఇప్పటికీ సినీ అభిమానుల చర్చల్లోకి వస్తుంటాయి.

స్టార్ హీరోలు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా 460 రోజులు థియేటర్లలో హౌస్‌ఫుల్.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us