
అందాల భామ అనుష్క కెరీర్ లో ఎన్నో హిట్స్, సూపర్ హిట్స్ ఉన్నాయి. అయితే అనుష్క స్టార్ డమ్ పెంచిన సినిమా మాత్రం అరుంధతి. ఈ సినిమా మాత్రం స్వీటీ కెరీర్ లో చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ సినిమాకు ముందు అనుష్క కేవలం గ్లామరస్ హీరోయిన్ పాత్రలే పోషించింది. కమర్షియల్ సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించింది. ప్రాధాన్యత ఉన్న రోల్స్ పెద్దగా చేయలేదు. అయితే 2009లో వచ్చిన అరుంధతి సినిమా అనుష్క కెరీర్ ను పూర్తిగా మలుపుతిప్పింది. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్ థ్రిల్లర్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. దాదాపు 13 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అప్ప్పట్లో సంచలనం సృష్టించింది.
స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో జేజమ్మగా అనుష్క అభినయానికి అందరూ ఫిదా అయిపోయారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హారర్ సీన్స్ ప్రేక్షకులను బయపెట్టాయి. ఇక అరుంధతి సినిమాలో ఎన్నో హారర్ సీన్స్ ఉన్నాయి వాటిలో అరుంధతి సినిమాలో అనుష్కను ఇంట్లోని రూమ్‌లో భయపెట్టే దెయ్యం సీన్ ఒకటి. ఈ సీన్ థియేటర్స్ లో చూస్తేనే దడుసుకొని జ్వరం వస్తుంది. టీవీలో చూసినా అదే ఫీల్ వస్తుంది.
అయితే ఆ దెయ్యం పాత్రను ఓ ప్రముఖ నటి పోషించిన విషయం చాలామందికి తెలియదు. అవును ఆ పాత్రలో కనిపించింది ఓ సీనియర్ హీరోయిన్. ఆమె ఎవరో కాదు సీనియర్ యాక్ట్రస్ జయలలిత. ఈ సీనియర్ నటి ఎన్నో సినిమాలు చేసి మెప్పించారు. ఎన్నో కామెడీ పాత్రలతో పాటు వ్యాంప్ పాత్రలు కూడా చేశారు ఆమె. ఇక ఆ దెయ్యం సీన్ షూట్ చేయడానికి ఏకంగా పది రోజులు పట్టిందని జయలలిత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ పాత్ర కోసం వేసిన మేకప్ కారణంగా తన స్కిన్, హెయిర్ డ్యామేజ్ అయినట్లు వెల్లడించారు జయలలిత. ఆ పాత్రకు మేకప్ కోసం బాంబే నుంచి మేకప్ మ్యాన్‌ను పిలిపించారని.. మేకప్ వేయడానికి 3 గంటలు అయితే.. తీయడానికి 6 గంటలు పట్టినట్లు ఆమె వివరించారు. దర్శకుడు కోడి రామకృష్ణ కృషి ఫలితంగానే ఆ పాత్ర అంత బాగా వచ్చిందని ఆమె అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి