Tollywood : ఈ అమ్మడి కోసం కుర్రాళ్ళు పడిచచ్చిపోతారు.. ఎవరో గుర్తుపట్టారా.?

|

Sep 20, 2024 | 7:15 AM

అచ్చం పక్కింటి అమ్మాయిలా కనిపించి.. నటించి మెప్పించింది ఈ బ్యూటీ. అవ్వడానికి మలయాళీ భామే అయినా అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. కట్టుబొట్టుతో అచ్చ తెలుగు అమ్మాయిలా ఉంటుంది. అందం అభినయం తో  ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ ఇప్పుడు కుర్ర హీరోలకు ఫస్ట్ ఛాయిస్‌గా మారింది.

Tollywood : ఈ అమ్మడి కోసం కుర్రాళ్ళు పడిచచ్చిపోతారు.. ఎవరో గుర్తుపట్టారా.?
Actress
Follow us on

ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులందరిని కట్టిపడేసిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. ఈమధ్య కొంతమంది భామలు ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఈ అమ్మడు కూడా అలానే పాపులర్ అయ్యింది. అచ్చం పక్కింటి అమ్మాయిలా కనిపించి.. నటించి మెప్పించింది ఈ బ్యూటీ. అవ్వడానికి మలయాళీ భామే అయినా అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. కట్టుబొట్టుతో అచ్చ తెలుగు అమ్మాయిలా ఉంటుంది. అందం అభినయం తో  ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ ఇప్పుడు కుర్ర హీరోలకు ఫస్ట్ ఛాయిస్‌గా మారింది. ఇంతకు పై ఫొటోలో చిరు నవ్వులు చిందిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. హీరోలకు సరి సమానంగా డాన్స్ లతోనూ ఇరగదీస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఆమె ఎవరో కనిపెట్టండి చూద్దాం.!

ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్.. ఎవరో తెలుసా.?

గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలే చేస్తుంది ఆ భామ.. ఇప్పటికే గుర్తుపట్టి ఉంటారే.. చారడేసి కళ్ళతో అందమైన నవ్వుతు ఆకట్టుకుంటున్న ఈ చిన్నారి ఎవరో కాదు.. నేచురల్ భామ సాయి పల్లవి. సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తెలియని ప్రేక్షకులు ఉండరు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల ఫెవరెట్ ఆమె. ఫిదా సినిమాను తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోరు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది సాయి పల్లవి.

ఇది కూడా చదవండి :డీ గ్లామర్ లుక్‌లో ఉన్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా..? ఇప్పుడు ఎక్కడ చూసిన ఆమె..

సహజమైన అందంతోనే కాదు సహజమైన నటనతో ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది. కేవలం తెలుగు సినిమాల్లోనే కాదు. తమిళ్, మలయాళ సినిమాల్లోనూ నటిస్తూ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చింది ఈ భామ. ఆతర్వాత తిరిగి సినిమాల్లో బిజీగా మారింది. ప్రస్తుతం నాగ చైతన్యతో కలిసి తండేల్ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరోసారి నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో నాని హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తాజా సాయి పల్లవి చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. క్యూట్ లుక్స్ తో కవ్విస్తున్న సాయి పల్లవి ఫోటోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : Tollywood : రోడ్డు పై డాన్స్‌తో అదరగొట్టిన టాలీవుడ్ హీరోయిన్.. కారణం తెలిస్తే శబాష్ అనాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.