కుబేర మూవీలో బిచ్చగత్తెగా నటించిన ఈ అమ్మాయి గుర్తుందా.? బయట చూస్తే అసలు గుర్తుపట్టలేరు!

తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేర సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నిరుపేద , ధనిక వ్యత్యాసం చూపిస్తూ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

కుబేర మూవీలో బిచ్చగత్తెగా నటించిన ఈ అమ్మాయి గుర్తుందా.? బయట చూస్తే అసలు గుర్తుపట్టలేరు!
Kuberaa

Updated on: Sep 13, 2026 | 12:13 PM

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘కుబేర’ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. విలక్షణమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. పేదరికం, డబ్బు, మనుషుల మధ్య ఉండే అంతరాలను చూపిస్తూ దర్శకుడు తెరకెక్కించిన విధానం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో ధనుష్ ఓ నిరుపేద బిచ్చగాడి పాత్రలో కనిపించి తన అద్భుతమైన నటనతో మెప్పించారు. మరోవైపు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటించి సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు. రష్మిక మందన్న కూడా తన పాత్రతో ఆకట్టుకున్నారు. మొత్తంగా కుబేర చిత్రం కథ, నటీనటుల ప్రతిభతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కుబేర సినిమాలో ధనుష్, నాగార్జున, రష్మికతో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు. వారిలో కుష్బూ అనే పాత్రలో నటించిన నటి ప్రేక్షకుల ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. సినిమాలో చివరి వరకు కనిపించే ఈ పాత్ర కథలో ఎమోషన్స్ పండించింది.

B Gopal: తండ్రి కొడుకులను పెట్టి సినిమా చేశా.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది : బి. గోపాల్

బిచ్చగాడి పాత్రలో కనిపించిన ధనుష్, కుష్బూకు సాయం చేసే సన్నివేశాలు ప్రేక్షకులను కదిలించాయి. ముఖ్యంగా ఆమె పాత్రకు సంబంధించిన సన్నివేశాలు థియేటర్లలో మంచి స్పందనను అందుకున్నాయి. అయితే కుష్బూ పాత్రలో నటించిన ఆ నటి ఎవరో తెలుసా.? ఆమె పేరు శ్రావణి సాటం. ఆమె కుబేర సినిమాలో బిచ్చగత్తె పాత్రలో సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. సినిమాలో గర్భంతో ఉన్న మహిళగా కనిపిస్తూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా భావోద్వేగాలను పలికించిన ఆమె నటన ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

ఇవి కూడా చదవండి

అప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

సినిమా విడుదలైన తర్వాత శ్రావణి సాటం గురించి నెటిజన్లు ఆసక్తిగా తెలుసుకోవడం ప్రారంభించారు. తెరపై నిరుపేద మహిళగా కనిపించిన ఆమె నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలుసుకునేందుకు పలువురు సోషల్ మీడియాలో ఆమె ఫొటోలను తెగ వెతికారు. కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ధనుష్ శ్రావణి సాటంను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆమె గురించి తెలుసుకున్న అభిమానులు, సినిమా విడుదల తర్వాత ఆమె నటనను ప్రత్యేకంగా ప్రశంసించారు. సోషల్ మీడియాలోనూ శ్రావణి సాటం యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. సినిమాల్లో సాదాసీదా పాత్రలో కనిపించిన ఆమె, బయట మాత్రం స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఈ నటి నిజ జీవితంలోని ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి.!

నా కులం వాళ్లే కుట్ర చేశారు.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తామన్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us