
ఈ దసరాకు చాలా సినిమాలు రిలీజయ్యాయి. రజనీకాంత్ జైలర్ 2, విజయ్ దేవరకొండ రణబాలి వంటి భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ పెద్ద సినిమాల పోటీలోనూ ఒక చిన్న సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అదే తెలుగమ్మాయ ఆనంది ప్రధాన పాత్రలో నటించిన ‘గరివిడి లక్ష్మీ. ఉత్తరాంధ్ర జానపద కళారూపమైన బుర్రకథకు ప్రాణం పోసిన దిగ్గజ కళాకారిణి రెడ్డి విజయలక్ష్మి (గరివిడి లక్ష్మి) జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. గౌరి నాయుడు జమ్ము ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. . గరివిడి లక్ష్మీగా ఆనంది నటించింది. అలాగే సీనియర్ హీరోయిన్ రాశి మరో కీలక పాత్ర పోషించారు. వీరితో పాటు నరేశ్, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్, కంచరపాలెం కిషోర్, కుశాలిని తదితరులు ఈ మూవీలో నటించారు. పీపుల్స్ మీడియా పతాకంపై టి.జి. విశ్వప్రసాద్, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. దసరా కానుకగా రిలీజైన గరివిడి లక్ష్మీ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఈ సినిమాను తెగ చూసేస్తున్నారు.ఇక సినిమా క్లైమాక్స్ లో రియల్ గరివిడి లక్ష్మి ని చూపించడం మరింత హైలెట్ గా నిలిచింది. ఇక మూవీ ప్రమోషన్లలో ఆమె కూడా స్వయంగా పాల్గొని పాటలు పాడడం సినిమాపై మరింత హైప్ ను పెంచింది.
ఇదిలా ఉంటే గరివిడి లక్ష్మి సినిమాలో మెయిన్ హైలెట్ అంటే ఆనంది నటనే అని చెప్పుకోవచ్చు. గరివిడి లక్ష్మి ఆమె జీవించేసిందని ప్రశంసలు వస్తున్నాయి. అయితే ఈ రియల్ స్టోరీకి ఆనంది ఫస్ట్ ఛాయిస్ కాదు. మలయాళం ముద్దుగుమ్మ నిత్యా మేనన్ తో ఈ సినిమాను చేద్దామనుకున్నారట డైరెక్టర్ గౌరి నాయుడు. అందులో భాగంగా ఆమెకు కథ కూడా చెప్పారట. మొదట స్టోరీ వినేందుకు డైరెక్టర్ కు కేవలం అరగంటే టైమ్ ఇ చ్చిన నిత్య ఆ తర్వాత ఏకంగా మూడు గంటల పాటు స్టోరీ విని చాలా ఇంప్రెస్ కూడా అయ్యిందట. సినిమా కూడా చేస్తానందట. అయితే ఆ తర్వాత నిర్మాణ సంస్థ టర్మ్స్, రెమ్యునరేషన్, డేట్స్ క్లాష్ అవ్వడం తదితర కారణాలతో నిత్య మేనన్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చిందట. గరివిడి లక్ష్మి సినిమా ప్రమోషన్లలో కూడా డైరెక్టర్ ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. గరివిడి లక్ష్మి సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లుతోన్న నేపథ్యంలో ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఒక వేళ నిత్యా మేనన్ గరివిడి లక్ష్మి సినిమా చేసి ఉంటే ఎలా ఉండేదోనని సినీ అభిమానులు లెక్కలేసుకుంటున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.