Jr NTR: తారక్‌ను ముద్దుగా ‘నాన్నా’ అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా? అందులో ఇద్దరు ఇప్పుడు లేరు

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ను ఇష్టపడని వారుండరు. సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరూ తారక్ ను అభిమానిస్తారు. ఇష్టపడతారు. ఈ క్రమంలోనే కొందరు హీరోలు, సీనియర్ నటుడు ఎన్టీఆర్ ను ముద్దు పేర్లతో కూడా పిలుస్తుంటారు.

Jr NTR: తారక్‌ను ముద్దుగా నాన్నా అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా? అందులో ఇద్దరు ఇప్పుడు లేరు
Jr NTR

Updated on: Jun 30, 2026 | 7:14 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడీ మ్యాన్ ఆఫ్ మాసెస్. దేవర, వార్ 2 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు డ్రాగన్ తో మరోసారి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. సినిమాల సంగతి పక్కన పెడితే..తెలుగు సినిమా ఇండస్ట్రీలో తారక్ ను అందరూ అభిమానిస్తారు. అందుకు కారణం అతని సినిమాలు మాత్రమే కారణం కాదు అతని వ్యక్తిత్వం కూడా. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిని కలుపుకుని వెళ్లడం తారక్ కు బాగా అలవాటు. అందుకే స్టార్ హీరోలు సైతం ఎన్టీఆర్ తో జోవియల్ గా ఉంటారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తారక్ అయితే బావా బావా అని పిల్చుకుంటారు. ఇక రామ్ చరణ – తారక్ అయితే బ్రదర్ అని పిల్చుకుంటారు. అలాగే మహేష్ బాబును అన్నా ఆప్యాయంగా పలకరిస్తాడు తారక్. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ను ప్రేమగా నాన్నా అని పిలిచే ముగ్గరు హీరోలు ఉన్నారు. అయితే అందులో ఇద్దరు హీరోలు ప్రస్తుతం ఈ లోకంలో లేరు.

ఎన్టీఆర్ ను నాన్నా అని పిలిచిన మొదటి వ్యక్తి ఆయన తండ్రి హరికృష్ణ. ఏదైనా ఈవెంట్లలో అయినా.. బహిరంగ ప్రదేశాల్లో కూడా తారక్ ను నాన్నా అనే పిలిచేవారు హరికృష్ణ. అయితే 8 ఏళ్ల క్రితం ఆయన ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ కు ఆయన అన్న కళ్యాణ్ రామ్ పెద్ద దిక్కుగా ఉన్నారు. అందుకే తండ్రిలాగా కళ్యాణ్ రామ్ కూడా తారక్ ను నాన్నా అని పిలుస్తుంటారు.
తల్లులు వేరైనా రామ లక్ష్మణుల్లా కలిసి ఉంటారు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్. సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువ అనుబంధంతో కలిసి మెలిసి ఉంటారీ నందమూరి బ్రదర్స్.

ఇక కుటుంబ సభ్యులు కాకుండా బయటి నుంచి ఎన్టీఆర్ ను నాన్నా అని పిలిచే వ్యక్తి రియల్ స్టార్ శ్రీహరి. బృందావనం సినిమాతో వీరి అనుబంధం చాలా బలపడిపోయింది. అలా శ్రీహరి కూడా ఎన్టీఆర్ ను నాన్నా అని పిలిచే వారు. కానీ ఈ నటుడు కూడా 49 ఏళ్ళ చిన్న వయసులోనే కన్ను మూశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Follow Us