AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : చిరంజీవి, వెంకటేశ్‏తో సినిమాలు.. ఇండస్ట్రీలోని ఏలిన హీరోయిన్.. చివరకు ముక్కలైన మనసుతో మరణం..

దక్షిణాదిలో సహజ నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి సుజాత. తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. మలయాళ కుటుంబానికి చెందిన ఈమె శ్రీలంకలో జన్మించి, సుమారు 300కు పైగా చిత్రాల్లో నటించారు. 1974లో ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన 'అవలోరు తోడర్ కథై' (తమిళం) సినిమాతో కథానాయికగా పరిచయం అయ్యారు.

Tollywood : చిరంజీవి, వెంకటేశ్‏తో సినిమాలు.. ఇండస్ట్రీలోని ఏలిన హీరోయిన్.. చివరకు ముక్కలైన మనసుతో మరణం..
Venkatesh, Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: May 15, 2026 | 9:11 AM

Share

విలక్షణ నటి సుజాత తెలుగు సినీ రంగంలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. సహజ సౌందర్యం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని తెలుగు వారి మదిలో సుస్థిర స్థానం సొంతం చేసుకున్నారు. నటభూషణ శోభన్ బాబు హీరోగా, దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో, యువచిత్ర అధినేత కాట్రగడ్డ మురారి నిర్మించిన గోరింటాకు చిత్రంతో ఆమె తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రం కోసం హీరోయిన్ వెతుకులాటలో తమిళ దర్శకుడు కే బాలచందర్ అవళ్ ఒరు తొదర్ కథైలో సుజాతను చూసి ఆమెను ఎంపిక చేశారు. 10వ తరగతి వరకు చదువుకున్న సుజాత, సినిమా మాసియా అనే మలయాళ పత్రికలో ప్రచురితమైన తన ఫోటో ద్వారా నాటక రంగంలోకి ప్రవేశించారు. అన్నయ్య ప్రోత్సాహంతో నాటకాల్లో రాణించి, 14 ఏళ్ల వయసులోనే మలయాళ చిత్రం తపస్వినితో తొలిసారిగా వెండితెరపై కనిపించారు. అనేక మలయాళ చిత్రాల్లో నటించిన తర్వాత, 1974లో కే బాలచందర్ తీసిన అవళ్ ఒరు తొదర్ కథైలో కవిత పాత్రతో ఆమె తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి, సూపర్ స్టార్‌గా ఎదిగారు. ఈ చిత్రం తెలుగులో అంతులేని కథగా రీమేక్ అయ్యింది.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

సుజాత నటించిన అనేక విజయవంతమైన తమిళ చిత్రాలు తెలుగులోకి రీమేక్ అయ్యాయి. వాటిలో దీపం (అమరదీపం), అవర్గళ్ (ఇది కథ కాదు), అన్నైకిలి (రామచిలుక), అండమాన్ కాదలి (అండమాన్ అమ్మాయి) వంటివి ప్రముఖమైనవి. 1975లో ఉరవసొల్లు ఒరుగన్, 1976లో అన్నైకిలి, 1977లో అవర్గళ్ చిత్రాలతో వరుసగా మూడు సంవత్సరాలు ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డులు అందుకొని హ్యాట్రిక్ సాధించారు. ఏడేళ్ల వ్యవధిలోనే 40 చిత్రాల్లో నటించి తిరుగులేని నాయికగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో అగ్ర హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు సరసన నటించారు. చిరంజీవికి సీతాదేవిలో అక్కగా, ప్రేమ తరంగాలు చిత్రంలో కథానాయికగా కనిపించారు. కృష్ణంరాజు, మోహన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలకు తల్లిగా నటించి మెప్పించారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేసి, ఆయన తనకు తెలుగు చిత్రాల ద్వారా పునర్జన్మనిచ్చారని కృతజ్ఞతగా చెప్పేవారు.

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

చంటి చిత్రంతో అమ్మ పాత్రలో, పెళ్లి చిత్రంలో విభిన్నమైన తల్లి పాత్రలో నంది అవార్డు పొందారు. శ్రీరామదాసులో దమ్మక్కగా ఆమె నటన చిరస్థాయిగా నిలిచిపోయింది. సుమారు 300కు పైగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటించారు. నటిగా సంతృప్తికరమైన జీవితం గడిపిన సుజాత, వైవాహిక జీవితంలో మాత్రం విషాదాన్ని చవిచూశారు. ఇంటి యజమాని కొడుకు జైకర హెన్రీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ అలవాట్లు నచ్చకపోవడం, నటిగా ఉండలేకపోవడంతో తిరిగి ఇండియా వచ్చారు. జైకర హెన్రీ మొదట్లో పచ్చళ్ల వ్యాపారం చేసినా, తర్వాత సుజాత సంపాదనపై ఆధారపడి, ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. అయినప్పటికీ సుజాత పిల్లల కోసం ఆ బాధను భరించారు. కొడుకు సాజిద్ సాఫ్ట్‌వేర్ రంగంలో, కూతురు దివ్య డాక్టర్‌గా స్థిరపడ్డారు. విపరీతమైన మానసిక ఒత్తిడి ఆమె ఆరోగ్యాన్ని దెబ్బతీసి, రెండు కిడ్నీలు పాడయ్యాయి. 2011 ఏప్రిల్ 6న గుండెపోటుతో సుజాత కన్నుమూశారు.

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

Follow Us
చిమ్నీ శుభ్రం చేయడం కష్టమా? ఈ సులభమైన పద్ధతులతో ఇక టెన్షన్ లేదు!
చిమ్నీ శుభ్రం చేయడం కష్టమా? ఈ సులభమైన పద్ధతులతో ఇక టెన్షన్ లేదు!
ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
పెట్రో భారం తర్వాత సామాన్యులకు మరో షాక్.. CNG ధర కూడా పెంపు..
పెట్రో భారం తర్వాత సామాన్యులకు మరో షాక్.. CNG ధర కూడా పెంపు..
మన అకౌంట్‌లో పొరపాటున డబ్బు క్రెడిట్‌ అయితే ఏం చేయాలి?
మన అకౌంట్‌లో పొరపాటున డబ్బు క్రెడిట్‌ అయితే ఏం చేయాలి?
మీకు అతిగా వేడి అనిపిస్తుందా? శరీరంలో ఆ విటమిన్ తగ్గిందేమో
మీకు అతిగా వేడి అనిపిస్తుందా? శరీరంలో ఆ విటమిన్ తగ్గిందేమో
అద్భుతం.. శివాలయం తలుపులు తెరవగానే కనిపించిన సీన్ చూసి..
అద్భుతం.. శివాలయం తలుపులు తెరవగానే కనిపించిన సీన్ చూసి..
రోహిత్ 45 జెర్సీ గౌరవం కాపాడిన తెలుగోడు
రోహిత్ 45 జెర్సీ గౌరవం కాపాడిన తెలుగోడు
ఏపీ నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్.. 1523 యూనివర్సిటీ అధ్యాపక పోస్ట
ఏపీ నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్.. 1523 యూనివర్సిటీ అధ్యాపక పోస్ట
బాడీ మొత్తాన్ని క్షణాల్లో కూల్ చేసే గిరిజనుల వంటకం
బాడీ మొత్తాన్ని క్షణాల్లో కూల్ చేసే గిరిజనుల వంటకం
వెల్లుల్లిని ఇలా తిన్నారంటే.. మీ ఆరోగ్యానికి తిరుగుండదు..బిందాస్!
వెల్లుల్లిని ఇలా తిన్నారంటే.. మీ ఆరోగ్యానికి తిరుగుండదు..బిందాస్!