
ముద్దమందారం సీరియల్‌తో తెలుగు వారికి బాగా దగ్గరైంది కన్నడ బ్యూటీ తనూజ పుట్టస్వామి. ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ తెలుగు తొమ్మిదో సీజన్ లోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ కు బాగా చేరువైంది. త్రుటిలో బిగ్ బాస్ టైటిల్ కోల్పోయినా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక బిగ్ బాస్ షోతో ఎంతో మంది స్నేహితులను కూడా సంపాదించుకుంది తనూజ. అందులో దివ్వెల మాధురి కూడా ఒకరు. బిగ్ బాస్ షోలోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఆమె మొదట తనూజ పై తీవ్రంగా విరుచుకుపడింది. ఇష్టమొచ్చినట్లు తిట్టిపారేసింది. కట్ చేస్తే.. వారం తిరగకముందే తనూజకు క్లోజ్ ఫ్రెండ్ అయిపోయింది మాధురి. మాధురి ఎలిమినేట్ అయ్యేంతవరకు హౌస్ లో ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా మెలిగారు. ఇక మాధురి ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు తనూజ బాగా ఎమోషనల్ అయ్యింది. బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత కూడా తనూజ, మాధురి చాలా సార్లు కలిశారు. ఈ నేపథ్యంలో ఇవాళ (మార్చి 05) తనూజ పుట్టిన రోజు జరుపుకొంటోంది.
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనూజ సెలబ్రేట్ చేసుకుంటోన్న ఫస్ట్ బర్త్ డే ఇది. దీంతో దివ్వెల మాధురి ఆమెకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. తనూజతో కేక్ కట్ చేయించి, చీర గాజులు పెట్టింది. అలాగే బంగారు చెవి కమ్మలను బహుమతిగా ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది దివ్వెల మాధురి. ‘హ్యాపీ బర్త్‌డే బంగారం.. మై స్వీట్ హార్ట్ తనూజ పుట్టస్వామి. ఇది నువ్వు నాతో జరుపుకొంటోన్న తొలి బర్త్‌డే! నువ్వు నేరుగా స్వర్గం నుంచే దిగివచ్చావు. నిన్ను నేను ఎప్పటికీ ప్రేమిస్తాను’ అని తనూజకు విషెస్ చెప్పింది. ఈ పోస్ట్ కు స్పందించిన తనూజ కూడా థ్యాంక్యూ మ్యాడీ అని రిప్లై ఇచ్చింది.
ప్రస్తుతం తనూజ, దివ్వెల మాధురీల వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.