
బిగ్ బాస్ ఫేమ్ దివ్వల మాధురి మరోసారి చిక్కుల్లో పడింది. గతంలో తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్ తో కలసి రీల్స్ చేసిన మాధురిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. తాజాగా మరోసారి తిరుమలలో అలాంటి పనే చేసి ఇబ్బందుల్లో పడింది మాధురి. ఏడుకొండలపై గెస్ట్ హౌస్‌లో బిగ్‌బాస్ ఫేమ్ తనూజ బర్త్‌డే వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది మాధురి. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఇప్పుడు ఇదే ఆమెను చిక్కుల్లో పడేసింది. ఎందుకంటే.. తిరుమల కొండపైకి కేక్‌లు తీసుకెళ్లడం నిషేధం. మరి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ కొండపైకి మాధురి ఎలా బర్త్ డే కేక్ తీసుకెళ్లారన్నది చర్చనీయాంశంగా మారింది. దీనిపై టీటీడీ విజిలెన్స్ కూడా ఆరా తీస్తోంది. అంతకు ముందే వీరు తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది.
కాగా గతంలోనూ ఇదే తిరుమల శ్రీవారి ఆలయం సాక్షిగా వివాదంలో చిక్కుకున్నారు దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి దంపతులు. మాడ వీధుల్లో సోషల్ మీడియా రీల్స్, వీడియోలు చేసి వాటిని నెట్టింట షేర్ చేసుకున్నారు. దీనికి సంబంధించి మాధురిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. ఇక లేటెస్ట్ గా తన క్లోజ్ ఫ్రెండ్, బిగ్ బాస్ విన్నర్ తనూజ కోసం బర్త్ డే కేక్ తెప్పించి కట్ చేయించింది. అంతేకాదు తనూజకు చీర గాజులతో పాటు బంగారు కమ్మలను కూడా బహుమతిగా ఇచ్చింది.
తనూజ బర్త్ డే సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది దివ్వెల మాధురి. ‘హ్యాపీ బర్త్‌డే బంగారం.. మై స్వీట్ హార్ట్ తనూజ పుట్టస్వామి. ఇది నువ్వు నాతో జరుపుకొంటోన్న ఫస్ట్ బర్త్‌డే! నువ్వు నేరుగా స్వర్గం నుంచే దిగివచ్చావు. నిన్ను నేను ఎప్పటికీ ప్రేమిస్తాను’ అని తనూజకు విషెస్ చెప్పింది. ఈ పోస్ట్ కు స్పందించిన తనూజ కూడా థ్యాంక్యూ మ్యాడీ అని రిప్లై ఇచ్చింది. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో అనుకోకుండా వివాదంలో చిక్కుకుంది మాధురి. మరి ఈ కాంట్రవర్సీపై ఆమె ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.