Disco Shanti : అక్కినేని నాగేశ్వరరావు ముందే కాలేజ్ స్టూడెంట్‌ను చితకొట్టిన డిస్కో శాంతి..

డిస్కో శాంతి.. ఈ పేరు మనకు చాలా సినిమాల్లో వినిపించిన పేరు. ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు డిస్కో శాంతి.

Disco Shanti : అక్కినేని నాగేశ్వరరావు ముందే కాలేజ్ స్టూడెంట్‌ను చితకొట్టిన డిస్కో శాంతి..
Disco Shanthi

Updated on: Aug 02, 2022 | 4:57 PM

డిస్కో శాంతి(Disco Shanti ).. ఈ పేరు మనకు చాలా సినిమాల్లో వినిపించిన పేరు. ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు డిస్కో శాంతి. 80లో డిస్కో శాంతి కోసం యువత థియటర్స్ కు క్యూ కట్టే వారు అనడంలో అతిశయోక్తి లేదు. ఓ వైపు సిల్క్ స్మిత రాణిస్తున్న సమయంలోనే డిస్కో శాంతి తన మార్క్ డాన్స్ లతో అలరించి ప్రేక్షకులను ఉర్రుతలూగించారు. ఆ తర్వాత ఆమె నటుడు శ్రీహరిని వివాహం చేసుకొని సినిమాలకు దూరం అయ్యారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూవస్తున్న డిస్కో శాంతి అడపా దడపా ఇంటర్వ్యూలలో కనిపిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో డిస్కో శాంతి మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఓ సినిమా షూటింగ్ లో జరిగిన సంఘటన గురించి ప్రస్తావించారు డిస్కో శాంతి. అక్కినేని నాగేశ్వరావు నటించిన కాలేజీ బుల్లోడు అనే సినిమాలో డిస్కో శాంతి ఓ స్పెషల్ సాంగ్ చేశారు. అయితే ఈ పాటను ఓ కాలేజ్ లో షూట్ చేశారట. డిస్కో శాంతిని అక్కినేని ర్యాగింగ్ చేస్తూ సాగుతుందట ఈ పాట. అయితే ఆ సమయంలో ఓ యువకుడు డిస్కో శాంతి తో అసభ్యకరంగా సైగలు చేశాడట. పాటలో భాగంగా డిస్కో శాంతి డ్రస్ ను ఏ.ఎన్.ఆర్ కట్ చేసే సందర్భం ఉందట.. ఆసమయంలో అక్కడ ఉన్న ఓ కాలేజీ స్టూడెంట్ కెమెరా దగ్గర నిలుచొని అసభ్యకరంగా సైగలు చేశాడట.. ఆ తర్వాత అతడిని పిలిచి కాలితో గట్టిగా తన్ని తరిమి తరిమి కొట్టారట డిస్కో శాంతి. దాంతో అక్కడ ఉన్న వారంతా షాక్ అయ్యారట. అక్కినేని నాగేశ్వర రావు కూడా షాక్ అయ్యి చూస్తూ ఉండిపోయారట.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి

 

Follow Us