Sukumar : సుకుమార్‌తో ఆ స్టార్ హీరో సినిమా అట్టకెక్కినట్టేనా..? అసలు విషయం ఏంటంటే..

|

Dec 30, 2021 | 9:08 AM

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పుష్ప సినిమాతో సాలిడ్ హిట్ అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నారు. ఐకాన్ స్టార్ ను అడివిలో తిరిగే పుష్పరాజ్ గా మర్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు సుకుమార్.

Sukumar : సుకుమార్‌తో ఆ స్టార్ హీరో సినిమా అట్టకెక్కినట్టేనా..? అసలు విషయం ఏంటంటే..
Sukumar
Follow us on

Sukumar : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పుష్ప సినిమాతో సాలిడ్ హిట్ అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నారు. ఐకాన్ స్టార్ ను అడివిలో తిరిగే పుష్పరాజ్ గా మర్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు సుకుమార్. గంధపు చెక్కల నేపథ్యంలో సాగిన ఈ సినిమా రెండు పార్టులుగా రానుంది. ఇప్పటికే పుష్ప మొదటి భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు సుకుమార్. ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ అనే  అంశాన్ని తీసుకొని కథని అల్లుకున్నాడు సుకుమార్. ఇక ఈ సినిమాకు పూర్తి న్యాయం చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.  మునుపెన్నడూ కనిపించని ఊర మాస్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో ఇప్పుడు పార్ట్ 2 పైన దృష్టి పెట్టాడు సుకుమార్.

ఇక పార్ట్ 2 పూర్తవడానికి ఎంత లేదన్న మరో 6 ఏ నెలల సమయం పడుతుంది. ఆతరువాత రామ్ చరణ్ తో సినిమా చేయనున్నాడు. రంగస్థలం సినిమాతో చరణ్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచింది ఈ సినిమా.. ఇప్పుడు మరోసారి చరణ్ తో సినిమా చేయనున్నాడు సుకుమార్. అయితే విజయ్ దేవరకొండతో సినిమా చేయనున్నానని గతంలో అనౌన్స్ చేశాడు సుకుమార్. అయితే ఇప్పుడు ఆ సినిమా ఊసే వినిపించడం లేదు. దాంతో విజయ్ దేవరకొండ సుకుమార్ సినిమా అటకెక్కినట్టే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు పుష్ప సినిమా పార్ట్ 2 సమయంలో కరోనా , కొత్త వేరియంట్ ఓమిక్రేన్ విజృంభిస్తే మళ్లీ షూటింగ్ లకు ప్యాకప్ చెప్పాల్సి వస్తుంది.. దాంతో సినిమా అనుకున్న సమయానికి పూర్తవుతుందని గ్యారెంటీగా చెప్పలేం.. దాంతో బన్నీ సినిమా.. చరణ్ సినిమా పూర్తయ్యే సరికి చాలా సమయం పడుతుంది. దాంతో విజయ్ తో సుకుమార్ సినిమా ఉండక పోవచ్చు అని అంటూ టాక్ వినిపిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Coronavirus: కపూర్‌ ఫ్యామిలీలో కరోనా కలకలం.. హీరో అర్జున్‌తో సహా వారు కూడా పాజిటివ్‌..

RRR: కేరళలో ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్.. రామ్ చరణ్ క్రేజ్ మాములుగా లేదుగా.. జై చరణ్ అంటూ..

Sai Pallavi: ఎర్రచీరలో మందార పువ్వులా మెరిసిన సాయి పల్లవి.. చూసేందుకు రెండు కళ్లు చాలవే..