Romantic Twitter Review: అదుర్స్ అనిపించుకుంటున్న ఆకాశ్ పూరీ.. రొమాంటిక్ సినిమా ట్విట్టర్ రివ్యూ..

హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు ఆకాశ్ పూరి..ఇప్పటికే పలు చిత్రాల ద్వారా

Romantic Twitter Review: అదుర్స్ అనిపించుకుంటున్న ఆకాశ్ పూరీ.. రొమాంటిక్ సినిమా ట్విట్టర్ రివ్యూ..
Romantic

Updated on: Oct 29, 2021 | 7:57 AM

హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు ఆకాశ్ పూరి..ఇప్పటికే పలు చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అంతగా ఆకట్టుకోలేకపోయాడు.. ఆకాశ్ నటించిన లెటేస్ట్ చిత్రం రొమాంటిక్. ఈ సినిమాతో ఎలాగైనా తనయుడిని ట్రాక్ ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నాడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్..ఈ చిత్రానికి అనిల్ పాదూరి దర్శకత్వం వహించగా.. నిర్మా్ణ భాద్యతలు దగ్గరుండి చూసుకున్నారు.. పూరీ జగన్నాథ్.. ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై బారీ హైప్ క్రియేట్ చేశారు ఛార్మి, పూరీ..

ఈరోజు విడుదలైన రొమాంటిక్ సినిమా చూసిన సినీ ప్రముఖులు.. ప్రేక్షకులు సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆకాశ్ ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ మూవీ అదిరిపోయిందని… ఆకాశ్ తన నటనతో అదుర్స్ అనిపించాడని.. పూరీ తనయుడిగా ఆకాశ్ తమ మార్క్ చూపించడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీని పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి, పూరీ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మించగా.. కేతిక శర్మ హీరోయిన్‏గా నటించింది. అలాగే ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. ఇక సీనియర్ నటి రమ్యక్రిష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది.

ట్వీట్స్..

Also Read: Bigg Boss 5 Telugu: శివాలెత్తిన యానీ మాస్టర్.. కత్తి అందుకున్న సిరి.. ఇదేం రచ్చ రా నాయనా..

Ajay Bhupathi: అభిమానులకు క్షమాపణలు చెప్పిన ఆర్‌ఎక్స్‌ 100 దర్శకుడు.. కారణమేంటో తెలుసా.?

RRR Movie: ఆర్‌.ఆర్‌.ఆర్‌ కోసం జక్కన్న అంత పెద్ద స్కెచ్‌ వేస్తున్నారా.? ఇదే నిజమైతే భారతీయ సినిమా స్థాయి..