Devi Sri Prasad: రామదాసు సినిమాలో దేవీ శ్రీ ఓ పాట పాడారని మీకు తెలుసా..?

|

Mar 04, 2023 | 10:58 AM

రాక్ స్టార్ గా తన మ్యూజిక్‌తో కుమ్మేస్తున్న దేవి శ్రీ.. సాంగ్స్ కూడా అద్భుతంగా పాడి అలరిస్తారు. అయితే తన సినిమాల్లోనే కాదు. ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్ కు కూడా పాటలు పాడారు

Devi Sri Prasad: రామదాసు సినిమాలో దేవీ శ్రీ ఓ పాట పాడారని మీకు తెలుసా..?
Devi Sri Prasad
Follow us on

రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ గురించి తెలియని సినీ లవర్స్ ఉండరేమో.. తన మ్యూజిక్ తో ప్రేక్షకులను అలరించే దేవిశ్రీ ప్రసాద్ బాలీవుడ్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంటున్నారు. దేవి సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా మారిన దేవి శ్రీ.. ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన సాంగ్స్ అందించారు. రాక్ స్టార్ గా తన మ్యూజిక్‌తో కుమ్మేస్తున్న దేవి శ్రీ.. సాంగ్స్ కూడా అద్భుతంగా పాడి అలరిస్తారు. అయితే తన సినిమాల్లోనే కాదు. ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్ కు కూడా పాటలు పాడారు దేవీ శ్రీ ప్రసాద్. అలాగే కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ లో కూడా పాటలు పాడారు. కింగ్ నాగార్జున నటించిన రామదాసు సినిమాలో దేవీ శ్రీ ప్రసాద్ ఒక సాంగ్ పాడారని మీకు తెలుసా.?

అవును రామదాసు సినిమాలో దేవీ శ్రీ ఒక పాట పాడారు.. ఆ సాంగ్ ఏంటంటే.. నాగార్జున నటించిన రామదాసు సినిమాలో ”ఏటయ్యిందే గోదారమ్మ.. ఎందుకీ ఉలికిపాటు గగ్గురుపాటు” అనే సాంగ్ దేవీ శ్రీ పాడారు.

ఒకసారి రాఘవేంద్రరావు దేవీ శ్రీకి ఫోన్ చేసి రామదాసు సినిమాలో ఒక పాట పాడాలని అని అన్నారట. అయితే ముందుగా దేవీ శ్రీ నమ్మలేదట. రామదాసు లాంటి సినిమాలో నేను పాట పడటం ఏంటి జోక్ చేస్తున్నారా అనుకున్నారట దేవీ. ఆ తర్వాత కీరవాణి గారు ఫోన్ తీసుకొని అవును ఒక పాట ఉంది. దానికి నీ వాయిస్ చాలా బాగుంటుంది అని అన్నారట. దాంతో వెంటనే ఆ పాట పడ్డారట దేవీశ్రీ. ఈ పాటలో కీరవాణి కూడా గొంతు కలిపారు.