AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghaati Movie: ఏంటి.. ‘ఘాటీ’కి అనుష్క ఫస్ట్ ఛాయిస్ కాదా? ఆ స్టార్ హీరోయిన్ నటించాల్సిందా? భలే తప్పించుకుందే

క్రిష్ జాగర్ల మూడి దర్శకత్వంలో అనుష్క నటించిన చిత్రం ఘాటీ. భారీ అంచనాల మధ్య ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆడియెన్స్ ను పెద్దగా మెప్పించలేపోయింది. సినిమా రిలీజ్ తర్వాత అనుష్క ఏకంగా సోషల్ మీడియాకు కూడా గుడ్ బై చెప్పేసింది.

Ghaati Movie: ఏంటి.. 'ఘాటీ'కి అనుష్క ఫస్ట్ ఛాయిస్ కాదా? ఆ స్టార్ హీరోయిన్ నటించాల్సిందా? భలే తప్పించుకుందే
Anushka Shetty Ghaati Movie
Basha Shek
|

Updated on: Sep 21, 2025 | 11:57 AM

Share

చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన సినిమా ఘాటి. వేదం లాంటి సూపర్ హిట్ తర్వాత అనుష్కా శెట్టి- క్రిష్ జాగర్ల మూడి కాంబినేషన్ లో తెరకెక్కిన రెండో సినిమా ఇది. అలాగే విక్రమ్ ప్రభు, రమ్య కృష్ణన్, జగపతి బాు, జిషు సేన్ గుప్తా, రవీంద్ర విజయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి ఘాటీ సినిమాను నిర్మించారు. నాగవెల్లి విద్యాసాగర్‌ స్వరాలు సమకూర్చారు. గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ కు ముందే భారీ అంచనాలే ఉన్నాయి. టీజర్, ట్రైలర్, సాంగ్స్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అయితే తీరా థియేటర్లలో విడుదలయ్యాక మాత్రం ఆడియెన్స్ ను తీవ్రంగా నిరాశపర్చింది ఘాటీ సినిమా. ఉపాధ్యాయుల దినోత్సవం కానుకగా సెప్టెంబర్ 05న విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీనికి తోడు పుష్ప సినిమాతో పోలీకలు ఉండడంతో ఈ మూవీపై జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో ఘాటీ సినిమా త్వరగానే థియేటర్లలో నుంచి వెళ్లిపోయింది. నిర్మాతలకు కూడా భారీగానే నష్టాలు వచ్చినట్లు తెలిసింది. కాగా ఈ సినిమా రిజల్ట్ తో అనుష్క కూడా పూర్తిగా నిరాశ చెందింది. అందుకే మూవీ రిలీజయ్యాక సోషల్ మీడియాకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించింది.

అయితే ఘాటీ సినిమాకు అనుష్క ఫస్ట్ ఛాయిస్ కాదట. నిజానికి క్రిష్ ఈ సినిమాను అనుష్కతో చేయాలని మొదట అనుకోలేదట. ఈ సినిమాను ముందుగా లేడీ సూపర్ స్టార్‌ నయనతారతో చేయాలనుకున్నారట. ఆమె ఇంటికి వెళ్లి స్టోరీ కూడా వినిపించారట. అయితే ఆ స్టోరీ విన్న నయనతార పెద్దగా ఆసక్తి చూపించలేదట. సినిమాలో వయలెంట్ కంటెంట్ ఎక్కువగా ఉండడం, పైగా అప్పటికే తన సినిమా డైరీ ఫుల్ కావడంతో ఘాటీ సినిమా చేయలేనని చెప్పేసిందట. దీంతో క్రిష్ అనుష్కను సంప్రదించారట. అప్పటికే తనకు వేదం లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన డైరెక్టర్ కావడంతో స్వీటీ వెంటనే ఘాటీ మూవీకి ఓకే చెప్పేసిందట. కాగా ఘాటీ సినిమా రిలీజ్‌కు ముందే సోషల్ మీడియాలో విపరీతంగా హైప్ వచ్చింది. అయినా సరే సినిమాకు అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు.

ఇవి కూడా చదవండి

నయనతార వద్దనడంతో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చాణక్యుడు చెప్పిన.. మనిషికి అతిపెద్ద శత్రువు ఏదో తెలుసా?
చాణక్యుడు చెప్పిన.. మనిషికి అతిపెద్ద శత్రువు ఏదో తెలుసా?
తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్‌పై సూర్య కీలక అప్‌డేట్
తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్‌పై సూర్య కీలక అప్‌డేట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ డే.. ప్రారంభమైన కేసీఆర్ విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ డే.. ప్రారంభమైన కేసీఆర్ విచారణ
ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం
ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం
టెన్త్ పాసైన వారికి 22,195 రైల్వే ఉద్యోగాలు.. డైరెక్ట్ లింక్‌ ఇదే
టెన్త్ పాసైన వారికి 22,195 రైల్వే ఉద్యోగాలు.. డైరెక్ట్ లింక్‌ ఇదే
పిగ్గీ బ్యాంకుల నుంచే పిల్లలకు మనీ మేనేజ్‌మెంట్ నేర్పడం ఎలా? 
పిగ్గీ బ్యాంకుల నుంచే పిల్లలకు మనీ మేనేజ్‌మెంట్ నేర్పడం ఎలా? 
బంగారం, వెండిధరల ఎఫెక్ట్‌.. రెచ్చిపోయిన దొంగలు
బంగారం, వెండిధరల ఎఫెక్ట్‌.. రెచ్చిపోయిన దొంగలు
ప్రశంసించడం కూడా కళే.. అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మారిపోండిలా!
ప్రశంసించడం కూడా కళే.. అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మారిపోండిలా!
వీడి ట్యాలెంట్‌కి హ్యాట్సాఫ్‌.. 15 సెకెండ్లలోనే మాయం చేస్తాడు..
వీడి ట్యాలెంట్‌కి హ్యాట్సాఫ్‌.. 15 సెకెండ్లలోనే మాయం చేస్తాడు..
అదృష్టం ఊరించింది..దురదృష్టం వెక్కిరించింది..వైభవ్ బ్యాడ్ లక్
అదృష్టం ఊరించింది..దురదృష్టం వెక్కిరించింది..వైభవ్ బ్యాడ్ లక్