Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంటీ..! పెద్దరాయుడులో బ్రహ్మానందం భార్య.. ఈ ఫెమస్ జబర్దస్త్ నటి అమ్మా..!!

ఎన్నో సినిమాల్లో ఆయన వైవిధ్యమైన పాత్రలు వేసి ప్రేక్షకులను గిలిగింతలు పెట్టి నవ్వించారు. బ్రహ్మానందం గారి కామెడీ గురించి చెప్పాలంటే ఒకటో.. రెండో సినిమాలు చెప్తే సరిపోదు. ఆయన నటించిన సినిమాలన్నీ చెప్పాలి.. సినిమా సినిమాకు ఆయన తన కామెడీతో ఆకట్టుకున్నారు. అలాగే కలక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమాల్లో బ్రహ్మానందం కామెడీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేది.

ఏంటీ..! పెద్దరాయుడులో బ్రహ్మానందం భార్య.. ఈ ఫెమస్ జబర్దస్త్ నటి అమ్మా..!!
Tollywood
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 31, 2024 | 6:10 PM

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఎన్నో వందల సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.  ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ప్రేక్షకులు పడీపడీ నవ్వుతారు. ఎన్నో సినిమాల్లో ఆయన వైవిధ్యమైన పాత్రలు వేసి ప్రేక్షకులను గిలిగింతలు పెట్టి నవ్వించారు. బ్రహ్మానందం గారి కామెడీ గురించి చెప్పాలంటే ఒకటో.. రెండో సినిమాలు చెప్తే సరిపోదు. ఆయన నటించిన సినిమాలన్నీ చెప్పాలి.. సినిమా సినిమాకు ఆయన తన కామెడీతో ఆకట్టుకున్నారు. అలాగే కలక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమాల్లో బ్రహ్మానందం కామెడీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేది. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు, సీన్స్ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసేవారు. ముఖ్యంగా పెద్దరాయుడు సినిమా గురించి చెప్పుకోవాలి. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. రజినీకాంత్ ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించారు. అలాగే మోహన్ బాబు ఈ మూవీలో డ్యూయల్ రోల్ లో కనిపించి మెప్పించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఓ సన్నివేశంలో బ్రహ్మానందం తాను ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని తన తండ్రి దగ్గరకు వచ్చే సీన్ బాగా పండింది.

ఈ సీన్ లో బ్రహ్మానందం భార్యగా నటించిన నటి గుర్తుందా.? ఆమె ఎవరో కాదు జబర్దస్త్ లేడీ కమెడియన్ సత్య శ్రీ తల్లి. సత్య శ్రీ జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. చమ్మక్ చంద్ర స్కిట్స్‌లో నటిస్తూ తన కామెడీతో ప్రేక్షకులను నవ్వుస్తుంది. ఆ మధ్య జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసింది. ఆతర్వాత తిరిగి జబర్దస్త్ లోకి వచ్చి ప్రస్తుతం బుల్లెట్ భాస్కర్ టీంలో చేస్తోంది. సత్య శ్రీ తల్లి పెద్దరాయుడు సినిమాతో పాటు ఇష్క్, ఆర్య 2 సినిమాల్లోనూ నటించింది. ఇక కూతురి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆమె సినిమాలు మానేసింది. ఈ విషయాన్నీ ఓ ఇంటర్వ్యూలో  సత్య శ్రీ తెలిపింది. ఇక సత్య శ్రీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

View this post on Instagram

A post shared by Satya Sri (@me_satyasri)

సత్య శ్రీ సోషల్ మీడియా

View this post on Instagram

A post shared by Satya Sri (@me_satyasri)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ స్టార్ హీరో సరసన శ్రీనిధి..
ఆ స్టార్ హీరో సరసన శ్రీనిధి..
ప్రేమ, డబ్బు, మీ సొంతం కావాలా.. గులాబీలతో ఈ చిట్కాలు ట్రై చేయండి
ప్రేమ, డబ్బు, మీ సొంతం కావాలా.. గులాబీలతో ఈ చిట్కాలు ట్రై చేయండి
అక్కతో చివరిసారి మాట్లాడిన ఎయిర్‌హోస్టెస్‌ నగాన్తోయ్‌ శర్మ
అక్కతో చివరిసారి మాట్లాడిన ఎయిర్‌హోస్టెస్‌ నగాన్తోయ్‌ శర్మ
మామిడితోటలో పనిచేస్తున్న కూలీలు..పొదల్లో కనిపించిన సీన్‌ చూసి..
మామిడితోటలో పనిచేస్తున్న కూలీలు..పొదల్లో కనిపించిన సీన్‌ చూసి..
ఆఫీసు టేబుల్ మీదే ఆమె ల్యాప్‌టాప్.. ఆమె మాత్రం అనంతలోకాలకు వీడియో
ఆఫీసు టేబుల్ మీదే ఆమె ల్యాప్‌టాప్.. ఆమె మాత్రం అనంతలోకాలకు వీడియో
ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదా? ఆ నష్టాలు తప్పవంతే..!
ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదా? ఆ నష్టాలు తప్పవంతే..!
పెరుగు ఎన్ని రోజుల తర్వాత చెడిపోతుంది? ఫ్రిజ్‌లో ఉంచితే ప్రమాదామా
పెరుగు ఎన్ని రోజుల తర్వాత చెడిపోతుంది? ఫ్రిజ్‌లో ఉంచితే ప్రమాదామా
ఇంటి గేటు ముందు నిల్చున్న వ్యక్తి..ఇంతలో అక్కడికి వచ్చిన ఎద్దు..
ఇంటి గేటు ముందు నిల్చున్న వ్యక్తి..ఇంతలో అక్కడికి వచ్చిన ఎద్దు..
ఎంతో సంతోషంగా కుమార్తె పెళ్లికి ఏర్పాట్లు.. ఇంతలోనే వీడియో
ఎంతో సంతోషంగా కుమార్తె పెళ్లికి ఏర్పాట్లు.. ఇంతలోనే వీడియో
వీధి కుక్కలకు భయపడి ఆ యువతి ఏం చేసిందో తెలిస్తే వీడియో
వీధి కుక్కలకు భయపడి ఆ యువతి ఏం చేసిందో తెలిస్తే వీడియో