Chiranjeevi: అక్కినేని నాగేశ్వర రావు ఆఖరి కోరిక తీర్చలేకపోయిన మెగాస్టార్ చిరంజీవి.. మరి ఇప్పుడైనా నాగార్జునతో..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున ఒకరు. వీరే కాదు వీరి కుటుంబాల మధ్య కూడా చాలా మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలో చిరంజీవి, నాగేశ్వరరావులకు సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని బయట పెట్టారు నాగార్జున.

Chiranjeevi: అక్కినేని నాగేశ్వర రావు ఆఖరి కోరిక తీర్చలేకపోయిన మెగాస్టార్ చిరంజీవి.. మరి ఇప్పుడైనా నాగార్జునతో..
Chiranjeevi, Nagarjuna

Updated on: Mar 28, 2026 | 6:57 PM

అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని నిలబెడుతూ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు అక్కినేని నాగార్జున. జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తున్నారు నాగ్. ఇప్పటికే 99 సినిమాలు పూర్తి చేసిన నాగ్ ఇప్పుడు వందో సినిమా కోసం బాగా కష్టపడుతున్నారు. ఓ తమిళ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే నాగర్జున తండ్రి అక్కినేని నాగేశ్వర రావుకు ఒక కోరిక ఉండేదట. అదేంటంటే.. చిరంజీవి, నాగార్జున బ్రదర్స్ ల కలిసి మెలిసి ఉంటారు కదా… వారిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటిస్తే చూడాలని ఏఎన్నార్ అనుకున్నారట. కానీ ఆ కోరికను అటు చిరంజీవి, ఇటు నాగార్జున కానీ ఎవరు తీర్చలేకపోయారు. నిజం చెప్పుకోవాలంటే.. చిరంజీవి, నాగార్జున ఇద్దరూ టాప్ హీరోలుగా వెలుగొందుతున్న క్రమంలో వీళ్ల కాంబోలో ఒక సినిమా చేయాలని నాగేశ్వరరావు తెగ ప్రయత్నాలు చేశారట. వీరి కాంబోలో మల్టీస్టారర్ సినిమా కోసం పలువురు దర్శక రచయితలతో మాట్లాడాడట. ఇద్దరు హీరోల ఇమేజ్ కి తగ్గట్టుగా కథలను రెడీ చేయమని చెప్పారట. అందుకు తగ్గట్టుగానే కొందరు దర్శక రచయితలు తాము రాసిన కథలను వినిపించారట. అయతే అవేవీ పెద్దగా ఎగ్జైట్ చేయలేకపోయాయట. దీంతో చిరు-నాగ్ ల మల్టీస్టారర మూవీ కలగానే మిగిలిపోయింది.

కాగా ఇప్పటికీ చిరంజీవి, నాగార్జునలు టాలీవుడ్ లో టాప్ హీరోలుగా వెలుగొందుతన్నారు. మరి ఇప్పుడైనా వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తే స్వర్గంలో ఉన్న నాగేశ్వరరావు సంతోషిస్తారని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ తో కలిసి ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాలో హీరోలుగా మెరిశారు. మరి దీనిలాగే చిరంజీవి, నాగార్జున కలిసి నటించగలిగే స్క్రిప్ట్ దొరుకుతుందేమో చూడాలి.

కాగా నాగార్జున- చిరంజీవి బెస్ట్ ఫ్రెండ్స్ ఒకటి. ఇద్దరం కలిసి నటించేందుకు తాము కూడా ఆసక్తిగా ఉన్నామని ఇద్దరూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. మరి ఈ హీరోల కాంబినేషన్ లో సినిమా వర్కౌట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కాగా అక్కినేని నాగేశ్వర రావుతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. మెకానిక్ అల్లుడు సినిమాలో ఈ ఇద్దరు హీరోలు ఆడిపాడారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us