Laya: హీరోయిన్ లయ కుమార్తెను చూశారా..? అచ్చం అమ్మ అందమే వచ్చింది..

|

Jun 21, 2024 | 11:57 AM

టాలీవుడ్‌లో ప‌దేళ్ల‌పాటు హీరోయిన్‌గా చాలా సినిమాలు చేసిన‌ లయ అమెరికాలో సెటిలయ్యింది. స్వయంవరం హీరోయిన్‌గా ఆమె ఫస్ట్ సినిమా. త్రివిక్ర‌మ్ స్టోరీ, డైలాగ్స్ అందించిన ఈ సినిమా సూపర్ హిట్. ఆ తర్వాత కుటుంబ కథా చిత్రాల్లో ఎక్కువగా కనిపించింది లయ. లయ కుమార్తెను మీరు ఎప్పుడైనా చూశారా..?

Laya: హీరోయిన్ లయ కుమార్తెను చూశారా..? అచ్చం అమ్మ అందమే వచ్చింది..
Laya
Follow us on

తెలుగు హీరోయిన్ లయకి గురించి స్పెషల్‌గా చెప్పేది ఏముంది. ఒకప్పుడు అగ్ర కథానాయికగా రాణించింది. ఇన్నోసెంట్ పాత్రల్లో మెప్పించింది. స్కిన్ షోకి దూరంగా ఉండి.. గుర్తుండిపోయే పాత్రలతో మెప్పించింది. ‘భద్రం కొడుకో’ సినిమాతో బాలనటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది లయ. ‘స్వయంవరం’ మూవీతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. చక్కనైన అందం, ముచ్చటగొలిపే అభినయం ఉడటంతో.. లయకు బోలెడన్ని ఆఫర్స్ వచ్చాయి. ముఖ్యంగా ఫ్యామిలీ టచ్ కథలకు ఆమెను ఎంపిక చేసుకునేవారు మేకర్స్. టాలీవుడ్‌లో ప‌దేళ్ల‌పాటు హీరోయిన్‌గా రాణించింది లయ. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. లయ మంచి చెస్ ప్లేయర్ కూడా. సెకండ్ క్లాస్‌లో ఉన్నప్పుడే చదరంగంలో మెలుకువలు నేర్చుకుంది. రాష్ట్రస్థాయిలో ఏడుసార్లు, జాతీయస్థాయిలో ఒకసారి మెడల్స్ సాధించింది. టెన్త్ క్లాస్ వరకు చెస్ పోటీలలో పాల్గొంది.

పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది లయ.  భర్తతో కలిసి అమెరికాలో సెటిల్ అయ్యింది. తన భర్త పేరు గణేష్ గోగుర్తి.  ఆయన యూఎస్‌లో పేరున్న డాక్టర్. ఇక లయ కూడా అక్కడ కొన్నాళ్ల పాటు ఐటీ ఫీల్డ్‌లో ఉద్యోగం చేసింది. ఇక తన భర్త  చిత్ర పరిశ్రమకు దూరంగా ఉండమని చెప్పలేదని.. కానీ బిజీ లైఫ్, పిల్లలు కారణంగా అక్కడే ఉండిపోయినట్లు తెలిపింది.  లయ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె ప్రజంట్ 10వ తరగతి చదువుతుండగా.. కుమారుడికి 12 ఏళ్లు ఉంటాయి.

ఇక లయ కుమార్తె శ్లోకా రవితేజ హీరోగా చేసిన అమర్ అక్బర్ ఆంటోని మూవీలో బాలనటిగా కనిపించింది. శ్లోక కూడా లయ లాగా ఎంతో చక్కగా, అందంగా ఉంటుంది. అచ్చం అమ్మ అందమే కుమార్తెకు వచ్చింది. వారిద్దర్నీ చూస్తే మదర్-డాటర్ అనుకోరు. సిస్టర్స్ అనుకుంటారు. తన కుమార్తె హీరోయిన్‌గా ఓ సినిమాలోనైనా నటిస్తే చూడాలని ఉందని గతంలో మనసులోని మాట బయటపెట్టారు లయ. దీంతో శ్లోక కూడా హీరోయిన్‌గా వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Laya Daughter

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.