Alekhya Harika: బిగ్ బాస్‌తో బాగా పాపులర్ అయ్యింది అలేఖ్య హారిక.. అలియాస్ దేత్తడి హారిక. ఈ అమ్మడు బిగ్ బాస్ కంటే ముంది యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటే హరికకు ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది. ఇక ఈ అమ్మడు బిగ్ బాస్‌లో తన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ భామ. బిగ్ బాస్ తర్వాత ఈ చిన్నదానికి పలు సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి. అలాగే వెబ్ సిరీస్‌లోనూ నటిస్తుంది హారిక. ఈ అమ్మడి పై నెట్టింట్లో పలు ట్రోల్స్ కూడా చక్కర్లు కొడుతూ ఉంటాయి. అయితే ట్రోల్స్ నుఎప్పుడూ పట్టించుకొని హారిక తాజాగా ఓ నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఎన్టీఆర్ సినిమాలోని డైలాగ్ తో కాస్త ఘాటుగానే రిప్లే ఇచ్చింది హారిక.. ఇంతకు ఆ నెటిజన్ హారికాను ఏమన్నాడంటే..
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే హారిక.. నిత్యం అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈ అమ్మడి ఫోటోలకు క్షణాల్లో లైకులు వర్షం కురిపిస్తారు కుర్రకారు. అయితే ఈ అమ్మడిని పలువురు హైట్ గురించి కామెంట్ చేస్తుంటారు.. రీసెంట్ గా ఓ నెటిజన్ కూడా హారిక ఎత్తు పై కామెంట్ చేశాడు.. దానికి ‘ఎవడు పడితే వాడు.. బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలు ఊడదీసి కొడతా.. అలా పిలవాలంటే ఒక అర్హత ఉండాలి లేదా నా అభిమాని అయ్యి ఉండాలి’.. రామయ్య వస్తావయ్యా సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ను షేర్ చేసిన హారిక.. ‘అదీ అర్ధమైంది కదా??’ అంటూ రాసుకొచ్చింది. ఇప్పుడు ఈ అమ్మడి వార్నింగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
మరిన్ని ఇక్కడ చదవండి :